Muskmelon Seeds Uses : కర్బూజ గింజలు పారేయకండి.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందండి-muskmelon seeds benefits you have to add in your diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Muskmelon Seeds Uses : కర్బూజ గింజలు పారేయకండి.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Muskmelon Seeds Uses : కర్బూజ గింజలు పారేయకండి.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Anand Sai HT Telugu
Feb 19, 2024 12:30 PM IST

Muskmelon Seeds Benefits : కర్బూజ పండు ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు దీని గింజలు కూడా మీకు చాలా ప్రయోజనాలు అందిస్తుంది.

కర్బూజ గింజల ప్రయోజనాలు
కర్బూజ గింజల ప్రయోజనాలు (Unsplash)

వేసవిలో కర్బూజ పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. దీనిని చాలా రకాలుగా తీసుకుంటారు. ఈ పండును కొందరు మాత్రం అస్సలు ఇష్టపడరు. దీనిని తినాలని అనిపించకపోయినా.., కర్బూజ దీని మిల్క్ షేక్, రసం చాలా రుచిగా ఉంటాయి. కర్బూజ సలాడ్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది సీజనల్ ఫుడ్ కావడంతో ఆరోగ్యానికి చాలా మంచిది.

కర్బూజ వేసవికి ఉత్తమమైన పండు. శరీరంలో నీటిశాతం మెయింటెయిన్ చేయడంలో చాలా సహాయపడుతుంది. అలాగే ఈ పండు వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఈ పండు ఎంతగానో సహకరిస్తుంది. అయితే పండ్లను కోసేటప్పుడు మనం ఎలాంటి ఆలోచన లేకుండా గింజలను పారేస్తాం. ఇకపై విత్తనాలను ఎప్పుడూ విసిరేయవద్దు. ఈ గింజలను తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు ఉన్నాయి.

విటమిన్ సి దొరుకుతుంది

కర్బూజ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొన్ని గింజలను నోటిలో వేసుకుని తింటే కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి.

జీర్ణ సమస్యలు రావు

అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలతో బాధపడేవారు కర్బూజ గింజలను తింటే అజీర్ణం సంబంధిత సమస్యలు రావు. మలబద్ధకం బాధితులు ఈ గింజలను తింటే మలబద్ధకం రాకుండా ఉంటుంది. రక్తపోటు ఉన్నవారు రోజూ కొద్దిగా గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

దగ్గు సమస్యలకు చెక్

దగ్గు సమస్య వర్షాకాలంలోనే కాకుండా వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వస్తుంది. కర్బూజ గింజలు తినడం వల్ల ఈ రకమైన సమస్యలను నివారించవచ్చు. ఇది ముక్కు కారటం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

ఒమేగా కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులు. కర్బూజ గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భిణీలకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గర్భాశయంలో నీటిశాతం తగ్గకుండా చేస్తుంది. తల్లి ఆరోగ్యానికి, పిల్లల అభివృద్ధికి కూడా చాలా సహాయపడుతుంది.

ప్రోటీన్ కలిగి ఉంటుంది

శాకాహారులు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్‌లో పుష్కలంగా ఉండే కర్బూజ గింజలు నుండి ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ఒమేగా 3 కొవ్వులు చేపలలో కనిపిస్తాయి. శాఖాహార ఆహారాలలో తక్కువ మొత్తంలో ఉంటాయి. గుమ్మడి గింజలు, కర్బూజ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఫోలేట్ ఉంటుంది. ప్రోటీన్ కలిగి ఉంటుంది. మీరు మాంసాహారులైతే, మీరు మాంసం నుండి ప్రోటీన్ పొందవచ్చు. శాఖాహారులు మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరులపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కర్బూజ గింజల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.

కర్పూజ తింటే ప్రయోజనాలు

కర్బూజలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది శరీర కొవ్వును తగ్గిస్తుంది. ఈ పండులో నీరు కూడా ఎక్కువ ఉండటం వలన, ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఆకలిని తీరుస్తుంది. కర్బూజా అధిక పీచు కలిగిన పండు, ఇది జీర్ణవ్యవస్థ పనితీరును వేగవంతంగా తయారు చేస్తుంది. కర్బూజ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

Whats_app_banner