Monsoon Tea Recipes | మాన్‌సూన్‌లో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆరోగ్యకరమైన టీ రెసిపీలు!
Monsoon tea recipes: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఒక కప్పు వేడి టీ తాగేందుకు వెనకాడకండి. మీరు ప్రయత్నించగల కొన్ని రకాల టీ రెసిపీలు ఇక్కడ చూడండి.
Monsoon tea recipes: మాన్‌సూన్ అంటే మండుతున్న వేడి నుండి ఉపశమనం. కానీ ఇది అనేక ఆరోగ్య సమస్యలను, వ్యాధులను కూడా ఆహ్వానిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే దగ్గు, జలుబుతో పాటు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు తరుముకొస్తాయి. అదనంగా చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యలు ఉంటాయి. వీటన్నింటి మధ్య ఒక మంచి విషయం ఏమిటంటే, ఈ సీజన్ లో మనం తీసుకునే కొన్ని ఆహారాలు, పానీయాలు కూడా కొన్ని వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒక కప్పు వేడివేడి టీ తాగటం ద్వారా కూడా మనం అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఒక కప్పు వేడి టీ తాగేందుకు వెనకాడకండి. మీరు ప్రయత్నించగల కొన్ని రకాల టీ రెసిపీలు ఇక్కడ చూడండి.
అల్లం టీ
అల్లం టీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో, జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది, వర్షాకాలంలో తప్పకుండా తాగాల్సిన టీ ఇది.
Ginger Tea Recipe
- 1 tsp అల్లం
- 2 స్పూన్ తేనె
- 2 లవంగాలు
- 1అంగుళం దాల్చిన చెక్క
తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు నీటిని మరిగించండి. ఆపై అందులో పైన పేర్కొన్న అన్ని పదార్థాలను వేయండి. చల్లారడానికి 15 నిమిషాలు ఉంచి, ఆపై ఒక కప్పులో వడకట్టి ఈ గోరువెచ్చగా టీని త్రాగాలి.
తులసి టీ
తులసి మీ రోగనిరోధక శక్తిని పెంచే ఒక అద్భుతమైన మూలిక. ఇది శరీరంలోని హానికర క్రిములతో పోరాడుతుంది, చర్మ వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.
basil tea recipe
- 1/4 కప్పు తులసి ఆకులు
- 1 స్పూన్ తేనె
- 2 స్పూన్ నిమ్మరసం
తయారీ విధానం:
- ముందుగా తులసి ఆకులను పావు కప్పు నీళ్లతో కలిపి మరిగించండి.
- ఒక మరుగు తీసుకుని, ఆ తర్వాత ఈ నీటిని ఒక కప్పులో వడకట్టి, ఆపై తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి.
పుదీనా టీ
పుదీనా టీ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. వర్షాకాలంలో సాధారణంగా తలెత్తే కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు ఈ టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.
Mint Tea Recipe
- కొన్ని పుదీనా ఆకులు
- 1 రెమ్మ రోజ్మరీ
- నిమ్మరసం రుచికి
తయారీ విధానం:
- ముందుగా ఒక పాన్ లో నీటిని మరిగించండి. అందులో రోజ్మెరీ వేసి ఉడికించండి.
- ఆ తర్వాత ఒక కప్పులో పుదీనా ఆకులను చించి వేయండి.
- ఇప్పుడు రోజ్మరీతో మరిగించిన నీటిని పుదీనా ఆకులు ఉన్న కప్పులో పోయండి. పది నిమిషాలు అలాగే ఉంచాలి.
చివరగా నిమ్మరసం పిండుకొని తాగాలి.
సంబంధిత కథనం