Hibiscus Oil: ఈ పువ్వులతో హెయిర్ ఆయిల్ తయారుచేసుకోండి, జుట్టు పొడవుగా పెరుగుతుంది-make hair oil with hibiscus flowers for long hair growth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hibiscus Oil: ఈ పువ్వులతో హెయిర్ ఆయిల్ తయారుచేసుకోండి, జుట్టు పొడవుగా పెరుగుతుంది

Hibiscus Oil: ఈ పువ్వులతో హెయిర్ ఆయిల్ తయారుచేసుకోండి, జుట్టు పొడవుగా పెరుగుతుంది

Haritha Chappa HT Telugu
Published Sep 14, 2024 09:30 AM IST

Hibiscus Oil: మందార పువ్వులు, ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గణేశునికి ఇష్టమైన పుష్పం కూడా మందారమే. ఈ పువ్వు సహాయంతో, మీరు ఇంట్లో నూనెను తయారు చేసుకోవచ్చు. ఈ నూనె జుట్టుకు ఎంతో మంచిదని భావిస్తారు. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

జుట్టు పొడవుగా పెరిగేందుకు ఆయిల్
జుట్టు పొడవుగా పెరిగేందుకు ఆయిల్ (Pixabay)

పూవుల్లో మందార పువ్వు చాలా పురాతనమైన పువ్వుగా చెప్పుకుంటారు. వీటిని భగవంతుని ఆరాధనలో కచ్చితంగా ఉపయోగిస్తారు. ప్రతి దేవతకు కొన్ని పువ్వులంటే చాలా ఇష్టం. ఇష్టమైన పువ్వులను దేవతలకు సమర్పించడం ద్వారా వారి కరుణా కటాక్షాలను పొందవచ్చు. అలా వినాయకుడికి మందార పూలంటే చాలా ఇష్టం. ఈ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. వీటిని పెంచడం చాలా ఇష్టం. ఆరోగ్యానికి మందార పూలు, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. దీనితో నూనె తయారుచేసుకుంటే జుట్టు పొడవుతా పెరుగుతుంది.

మందార పూల నూనె తయారీ

మందార పూలతో నూనె తయారు చేయడానికి ఎనిమిది మందార పువ్వులను తీసుకోండి. అలాగే ఒక కప్పు కొబ్బరినూనె, ఎనిమిది మందార ఆకులు కూడా తీసుకోండి. మందార పువ్వులు, మందార ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొబ్బరినూనె చేసి చిన్న మంట మీద వేడిచేయాలి. అందులో మందార పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు వేడి చేసి తర్వాత చల్లార్చి నిల్వ చేసుకోవాలి. మందార నూనె రెడీ అయినట్టే. మీకు జుట్టు రాలే సమస్య ఉన్నా లేదా మీ జుట్టు చాలా బలహీనంగా మారుతున్నా ఈ నూనెను తలకు పట్టిస్తూ ఉండండి.

నూనె వేడి చేసేటప్పుడు అందులో నిగెల్లా గింజలు, కరివేపాకులు కూడా వేస్తే ఎంతో మంచిది. ఈ రెండూ జుట్టుకు మేలు చేస్తాయి. ఈ నూనెను తలకు అప్లై చేయాలంటే ముందుగా జుట్టును బాగా దువ్వుకోవాలి. తర్వాత మందార నూనెను కొద్దిగా చేతిలో వేసుకుని తలకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తరువాత అరగంట పాటూ వదిలేయాలి. ఏదైనా ఆయుర్వేద షాంపూతో జుట్టును వాష్ చేసుకోవాలి.

ఈ మందార నూనెను కేవలం జుట్ట కోసమే కాదు, పాదాల కోసం కూడా వాడవచ్చు. పాదాల పగుళ్లు సమస్యతో బాధపడుతున్నవారు ఈ నూనెను రాసుకుంటూ ఉండాలి. ఇది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

చుండ్రుతో బాధపడేవారు మందార నూనెను ఉపయోగిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. జుట్టుకు మంచి మెరుపును కూడా ఇస్తాయి. ఈ నూనె వెంట్రుకలు బలంగా ఎదిగేలా చేస్తాయి. కాబట్టి వారానికి రెండు మూడు సార్లు ఈ నూనెను రాసుకునేందుకు ప్రయత్నించండి. రెండు నెలల్లోనే మీ జుట్టు పెరుగుదలను మీరు గుర్తిస్తారు.

Whats_app_banner