Apple iPhone 14 Leaked : ఈ స్మార్ట్​ఫోన్​తో 8K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చంట..-leaked photos shows how new dual notch on apple iphone 14 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Apple Iphone 14 Leaked : ఈ స్మార్ట్​ఫోన్​తో 8k వీడియో కూడా రికార్డ్ చేయొచ్చంట..

Apple iPhone 14 Leaked : ఈ స్మార్ట్​ఫోన్​తో 8K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చంట..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 06, 2022 11:19 AM IST

Apple iPhone 14 : సెప్టెంబరు 7వ తేదీన జరగబోయే Apple ఈవెంట్ దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త iPhone 14 సిరీస్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లలో ఎక్కువ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ కెమెరా, ఫేస్ ID ఫీచర్ కోసం రీడిజైన్ చేసిన డ్యూయల్ కట్-అవుట్ డిజైన్ గురించే సాగుతుంది. మరి ఈ లీక్స్ Apple iPhone 14 గురించి ఏమి చెప్తున్నాయో తెలుసుకుందాం.

<p>Apple iPhone 14</p>
Apple iPhone 14

Apple iPhone 14 : Apple iPhone 14 సిరీస్‌ లాంచ్ కాకముందే అంచనాలను పెంచేస్తున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన జరిగే ఈవెంట్‌కన్నా ముందే.. Apple iPhone 14 Pro డిజైన్, పరిమాణం కొత్తగా విడుదలైన చిత్రాలలో వెల్లడైంది. కొరియన్ బ్లాగ్ నేవర్‌లో పంచుకున్నట్లుగా.. ప్రస్తుత ఆపిల్ ఐఫోన్ 13 ప్రోలో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో కేస్ అమర్చారు. ఈ మార్పు రాబోయే ఐఫోన్ మోడల్ పరిమాణంలో కొన్ని కీలక మార్పులను వెల్లడిస్తుంది.

విడుదలైన చిత్రాల ప్రకారం Apple iPhone 14 Pro వెనుక కెమెరా లెన్స్‌లు Apple iPhone 13 Proలో కనిపించే వాటి కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. Apple iPhone 14 Pro విషయంలో వైడ్, అల్ట్రా వైడ్, టెలిఫోటో కెమెరాల లెన్స్‌లు పరిమాణంలో పెరుగుతాయనే ఆలోచనను ఇస్తుంది. ఇది కాకుండా పెద్ద కెమెరా లెన్స్‌ల కారణంగా ఐఫోన్ 14 ప్రోలో ఫ్లాష్, లిడార్ స్కానర్ కూడా కొద్దిగా మార్చినట్లు తెలుస్తుంది.

Apple iPhone 14 Proలో పెద్ద లెన్స్‌లు ఉన్నాయని క్లెయిమ్ చేసే నివేదికను చూడటం ఇదే మొదటిసారి కాదు. మునుపటి అమ్మకాలు, డమ్మీ మోడల్‌లు కూడా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో మరింత ప్రముఖమైన కెమెరా బంప్ ఉంటుందని వెల్లడించాయి. ఈ సంవత్సరం Apple iPhone 14 Pro మోడల్‌లు మెరుగైన తక్కువ కాంతి ఫోటోగ్రఫీ, ఆస్ట్రోఫోటోగ్రఫీతో కొత్త 48MP వైడ్ కెమెరాను కలిగి ఉంటాయని ఇప్పటికే వెళ్లడించింది. స్మార్ట్‌ఫోన్‌లు 8K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయని కూడా ఓ పుకారు ఉంది.

గత రెండేళ్ల మాదిరిగానే ఆపిల్ 2022లో నాలుగు కొత్త ఐఫోన్ మోడల్‌లను విడుదల చేస్తుంది. Apple iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max. iPhone 14 సిరీస్ కాకుండా.. టెక్ దిగ్గజం Apple Watch Series 8, Apple Air Pods Pro 2లను లాంచ్ చేసే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం.. Apple ఫార్ అవుట్ ఈవెంట్ సెప్టెంబర్ 7న రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం