iPhone 14 Pro | ఐఫోన్ 14 లో ఈ ఫీచర్స్ హైలైట్.. ఇక మార్కెట్లో వీటికి తిరుగులేదు!-iphone 14 pro exciting new features leaked ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iphone 14 Pro | ఐఫోన్ 14 లో ఈ ఫీచర్స్ హైలైట్.. ఇక మార్కెట్లో వీటికి తిరుగులేదు!

iPhone 14 Pro | ఐఫోన్ 14 లో ఈ ఫీచర్స్ హైలైట్.. ఇక మార్కెట్లో వీటికి తిరుగులేదు!

Aug 02, 2022, 04:45 PM IST HT Telugu Desk
Aug 02, 2022, 04:45 PM , IST

Apple బ్రాండ్ నుంచి నెక్స్ట్-జెన్ ఐఫోన్ 14 సిరీస్ త్వరలో లాంచ్ కాబోతుంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్ కు సంబంధించిన అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా రాబోయే ఐఫోన్ 14 ప్రో మోడల్‌లో భారీ అప్‌గ్రేడ్‌లు ఉండవచ్చు. వాటిలో కొన్ని ఇక్కడ తెలుసుకోండి.

ఐఫోన్‌లు అన్నింటికంటే వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు. పనితీరులో గానీ, నాణ్యతలో గానీ ఇవి ఎంతో మెరుగ్గా ఉంటాయి. అందుకే ఎంత ఖరీదైనప్పటికీ వీటి డిమాండ్ తగ్గటం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఐఫోన్ 14 సిరీస్‌లో పనితీరును ఇంకా మెరుగుపరుస్తున్నట్లు తెలుస్తోంది.

(1 / 6)

ఐఫోన్‌లు అన్నింటికంటే వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు. పనితీరులో గానీ, నాణ్యతలో గానీ ఇవి ఎంతో మెరుగ్గా ఉంటాయి. అందుకే ఎంత ఖరీదైనప్పటికీ వీటి డిమాండ్ తగ్గటం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఐఫోన్ 14 సిరీస్‌లో పనితీరును ఇంకా మెరుగుపరుస్తున్నట్లు తెలుస్తోంది.(FrontPageTech)

MacRumours నివేదిక ప్రకారం, iPhone 14 Pro మోడల్‌లలో RAM విభాగంలో పెద్ద మార్పును పొందుతాయని భావిస్తున్నారు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ లలో 6GB LPDDR5 ర్యామ్ సామర్థ్యం కలిగి ఉంటాయని నివేదించారు.

(2 / 6)

MacRumours నివేదిక ప్రకారం, iPhone 14 Pro మోడల్‌లలో RAM విభాగంలో పెద్ద మార్పును పొందుతాయని భావిస్తున్నారు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ లలో 6GB LPDDR5 ర్యామ్ సామర్థ్యం కలిగి ఉంటాయని నివేదించారు.(Reuters)

ప్రస్తుతం నడుస్తున్న iPhone 13 సిరీస్‌ ఫోన్లు 4GB RAMను కలిగి ఉన్నాయి. ప్రస్తుత iPhone 13 సిరీస్‌కు శక్తినిచ్చే పాత LPDDR4 RAMతో పోలిస్తే LPDDR5 RAM మరింత వేగవంతమైన, సమర్థవంతమైన పనితీరును కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇది మార్కెట్లో ఐఫోన్ స్థానాన్ని కచ్చితంగా బలోపేతం చేస్తుంది.

(3 / 6)

ప్రస్తుతం నడుస్తున్న iPhone 13 సిరీస్‌ ఫోన్లు 4GB RAMను కలిగి ఉన్నాయి. ప్రస్తుత iPhone 13 సిరీస్‌కు శక్తినిచ్చే పాత LPDDR4 RAMతో పోలిస్తే LPDDR5 RAM మరింత వేగవంతమైన, సమర్థవంతమైన పనితీరును కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇది మార్కెట్లో ఐఫోన్ స్థానాన్ని కచ్చితంగా బలోపేతం చేస్తుంది.(Front Page Tech)

ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో నివేదిక ఐఫోన్ 14 ప్రో మోడల్‌లకు ఫ్లాగ్‌షిప్ A16 బయోనిక్ చిప్ శక్తినిస్తుందని గతంలో సూచించింది. మరోవైపు, నాన్-ప్రో మోడల్‌లు A15 బయోనిక్ చిప్‌సెట్ అప్‌గ్రేడ్ వెర్షన్‌తో కొనసాగుతాయి. అంటే ప్రస్తుతం iPhone 13 ప్రో మోడల్‌ ఉన్న చిప్ సెట్ రాబోయే నాన్-ప్రో మోడల్‌లకు అమర్చుతున్నారు.

(4 / 6)

ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో నివేదిక ఐఫోన్ 14 ప్రో మోడల్‌లకు ఫ్లాగ్‌షిప్ A16 బయోనిక్ చిప్ శక్తినిస్తుందని గతంలో సూచించింది. మరోవైపు, నాన్-ప్రో మోడల్‌లు A15 బయోనిక్ చిప్‌సెట్ అప్‌గ్రేడ్ వెర్షన్‌తో కొనసాగుతాయి. అంటే ప్రస్తుతం iPhone 13 ప్రో మోడల్‌ ఉన్న చిప్ సెట్ రాబోయే నాన్-ప్రో మోడల్‌లకు అమర్చుతున్నారు.(Amritanshu / HT Tech)

ఇక ఐఫోన్ 14 సిరీస్ డిజైన్ కూడా ఐఫోన్ 12 సిరీస్‌తో పరిచయం అయిన అదే ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. సన్నని-ఫ్లాట్ అంచులు, పెద్ద కెమెరా బంప్, కొత్త నాచ్ డిజైన్ ఉండవచ్చు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో iPhone 14 సిరీస్ అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

(5 / 6)

ఇక ఐఫోన్ 14 సిరీస్ డిజైన్ కూడా ఐఫోన్ 12 సిరీస్‌తో పరిచయం అయిన అదే ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. సన్నని-ఫ్లాట్ అంచులు, పెద్ద కెమెరా బంప్, కొత్త నాచ్ డిజైన్ ఉండవచ్చు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో iPhone 14 సిరీస్ అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.(FrontPageTech)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు