apple airpods pro2:గుడ్‌న్యూస్.. AirPods Pro 2పై 8000 వరకు డిస్కౌంట్.. ఎక్కడంటే!
MagSafe ఛార్జింగ్ కేస్‌తో Apple AirPods ప్రో ప్రస్తుతం అమెజాన్ Great Freedom Festival సేల్‌లో రూ. 17,990కి అందుబాటులో ఉంది. దీనిపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
Apple iPhone 14 సిరీస్‌తో పాటు Apple AirPods Pro 2ని వచ్చే నెలలో విడుదల చేయనుంది టెక్ దిగ్గజం ఆఫీల్. ఎయిర్‌పాడ్స్ ప్రో గురించి ఎటువంటి వివరాలను వెల్లడించనప్పటికీ, టిప్‌స్టర్లు నెక్స్ట్-జెన్ ఎయిర్‌పాడ్‌ల గురించి కొన్ని క్లూస్ ఇచ్చారు. Apple AirPods Pro 2 లాంచ్‌కు ముందు, Amazon Prime సభ్యుల కోసం 'Great Freedom Festival' సేల్‌లో MagSafe ఛార్జింగ్ కేస్‌తో కూడిన లెటెస్ట్ జనరెషన్ Apple AirPods ప్రోపై అమెజాన్ ఆకర్షణీయమైన డిల్‌ను అందిస్తోంది.
ఈ సేల్ లో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గృహోపకరణాలతో సహా వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తోంది. MagSafe ఛార్జింగ్ కేస్‌తో కూడిన Apple AirPods ప్రో ప్రస్తుతం అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్‌లో రూ. 8000 తగ్గింపు లభిస్తుంది. రూ. 17,990కి ఈ AirPods అందుబాటులో ఉన్నాయి. Apple AirPods ప్రో ప్రస్తుతం ధర రూ. 26000గా ఉంది,
దీనితో పాటు, Apple AirPods ప్రో కొనుగోలుదారులు SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1500 వరకు 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు, TWS ఇయర్‌బడ్‌ల ధరను రూ. 16,490కి తగ్గించవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 సందర్భంగా ఎంపిక చేసిన యాక్సెసరీలు, ఆడియో ఉత్పత్తుల కొనుగోలుపై కొనుగోలుదారులు రూ. 2 నుండి 4 నెలల వరకు ఆడిబుల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
సంబంధిత కథనం