తెలుగు న్యూస్ / ఫోటో /
Apple Watch | ప్రాణాలను కాపాడే స్మార్ట్ వాచ్స్.. అందుబాటులోకి అప్పుడే..
రాబోయే యాపిల్ వాచ్ ఫీచర్‌లలో.. బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న ఎంతో మందికి ఈ వాచ్ సహాయపడుతుంది. లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడుతుంది. మరి ఈ యాపిల్ వాచ్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారు.. ఇంకా దీనిలో స్పెషల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 6)
ఈ రకమైన సాంకేతికతను కలిగిన వాచ్‌లను 2023 నాటికి యాపిల్ సంస్థ తయారు చేస్తుందని భావించినప్పటికీ.. అది నిరుత్సాహమే అయింది. 2024లో ఈ రకమైన వాచ్‌లను తీసుకువస్తామని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.(Apple)
(2 / 6)
ఈ యాపిల్ వాచ్‌లు ఒక వ్యక్తికి ఉన్న రక్తపోటు పెరుగుదల లేదా తగ్గుదలని గుర్తించగలదు. ఆ విధంగా దీనిని రూపొందించారు. సెన్సార్, సాఫ్ట్‌వేర్ కోసం సాంకేతికతపై పని చేస్తున్న వివిధ విభాగాలను ఇది కలిగి ఉంటుంది. శామ్సంగ్ వంటి ప్రత్యర్థి టెక్ దిగ్గజాల స్మార్ట్‌వాచ్‌లలో బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ… ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. (Amritanshu / HT Tech)
(3 / 6)
ఆపిల్ తన ఉద్యోగులపై ఈ సిస్టమ్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇది నిజంగా గొప్ప ఆవిష్కరణ- నాన్-ఇన్వాసివ్ షుగర్ మానిటరింగ్ సిస్టమ్‌పై కూడా పని చేస్తోంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది ఒక వరం. రోజువారీ సూది-ప్రిక్స్ నుంచి ఇది వారిని కాపాడుతుంది.(Reuters)
(4 / 6)
మహిళల ఆరోగ్యం, నిద్ర, ఫిట్‌నెస్, మందుల నిర్వహణ ఫీచర్లు, అలాగే బాడీ టెంపరేచర్ సెన్సార్ వంటి కొత్త ఫీచర్‌లు త్వరలోనే యాడ్ చేయనున్నారు.(Amritanshu / HT Tech)
(5 / 6)
ఈ ఫీచర్‌లతో పాటు, హెల్త్ యాప్ కూడా పెద్ద అప్‌డేట్‌లను అందుకోవలసి ఉంది. యాపిల్ ఈ జూన్‌లో ప్రారంభించబోయే వాచ్ ఓఎస్9లో ట్రయల్ ఫిబ్రిలేషన్ డిటెక్షన్ ఫీచర్‌ను చేర్చవచ్చు.(Apple)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు