Fertility : నిద్ర తక్కువైతే సంతానోత్పత్తిపై ప్రభావం.. ఈ తప్పును అస్సలు చేయకండి-lack of sleep affect fertility all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fertility : నిద్ర తక్కువైతే సంతానోత్పత్తిపై ప్రభావం.. ఈ తప్పును అస్సలు చేయకండి

Fertility : నిద్ర తక్కువైతే సంతానోత్పత్తిపై ప్రభావం.. ఈ తప్పును అస్సలు చేయకండి

Anand Sai HT Telugu
Jun 01, 2024 08:00 PM IST

Lack Of Sleep : నిద్ర తక్కువైతే మెుత్తం ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. అంతేకాదు సంతానోత్పత్తి కూడా ప్రభావితమవుతుంది. అందుకే మంచి నిద్ర.. మంచి ఆరోగ్యాన్నిస్తుంది.

నిద్ర తక్కువైతే సంతానోత్పత్తిపై ప్రభావం
నిద్ర తక్కువైతే సంతానోత్పత్తిపై ప్రభావం

నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానవుని ప్రాథమిక అవసరాలలో నిద్ర ఒకటి. కానీ కొన్నిసార్లు మనం నిద్రలేమితో బాధపడుతాం. అందువల్ల నిద్రలేమి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నిజానికి ఇది సంతానోత్పత్తిని కూడా నాశనం చేస్తుంది. నిద్రలేమి ఒక్కటే కాదు ధూమపానం, మద్యపానం, చెడు జీవనశైలి, ఆహారం వంటివి మీకు కొన్ని సవాళ్లను కలిగిస్తాయి.

మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అన్నీ తరచుగా నిద్రలేమితో ముడిపడి ఉంటాయి. ఇది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి, ఆరోగ్యంతో ముందుకు సాగడానికి నిద్ర అనేది అన్నింటికీ సహాయపడుతుంది. కానీ ఇది సాధ్యం కానప్పుడు ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇది మీ సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది.

పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం

నిద్రలేమి మహిళల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులు తరచుగా దీని ఫలితంగా ఉంటాయి. ఈ రకమైన హార్మోన్ల మార్పులు సంతానోత్పత్తి అవకాశాన్ని తగ్గిస్తాయి. అండోత్సర్గానికి సంబంధించిన రుగ్మతలు, రుతుక్రమ రుగ్మతలు, స్పెర్మ్‌ నాణ్యత లేకపోవడం, పురుషులలో స్పెర్మ్ ఆకారం ఇవన్నీ దీనికి సంబంధించినవి. హార్మోన్ల అసమతుల్యత లైంగిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

హార్మోన్ల మార్పులు

ఇది కాకుండా నిద్ర లేకపోవడం పురుషులు, స్త్రీలలో వివిధ ఒత్తిడితో కూడిన హార్మోన్ల మార్పులకు దారితీస్తుంది. నిద్ర లేకపోవడం ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, ఇతర పునరుత్పత్తి హార్మోన్ల స్థాయిలకు కూడా అంతరాయం కలిగిస్తుంది. మీరు ఈ విషయాలన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెలటోనిన్ మనకు నిద్రపోవడానికి సహాయపడే హార్మోన్. ఇది మీ అండోత్సర్గానికి కూడా సహాయపడుతుంది. నిద్ర లేకపోవడం అంటే శరీరాన్ని నాశనం చేయడమే. ఇలా చేయడం ద్వారా, ఇది అండోత్సర్గము, సంతానోత్పత్తిని కూడా ప్రభావితం అవుతుంది.

8 గంటల నిద్ర

సాధారణ పరిస్థితుల్లో కూడా కనీసం 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. అయితే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజుకు కనీసం 6-7 గంటలు నిద్రపోవాలి. కానీ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోకుండా ప్రయత్నించండి. ఇది కూడా మీ సంతానోత్పత్తి, ఇతర ఆరోగ్య సమస్యలను ప్రభావితం చేస్తుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం రాత్రికి 7-8 గంటలు నిద్రించే వారు ఇతరుల కంటే మెరుగైన IVF విజయాన్ని కలిగి ఉంటారు. కానీ 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి గర్భం దాల్చే అవకాశం 15శాతం మాత్రమే. ఆరోగ్యకరమైన గర్భం కోసం కనీసం 7-8 గంటల నిద్ర చాలా ముఖ్యం.

నిద్రకు చిట్కాలు

మీ నిద్రను మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఉన్నాయి. వ్యాయామం కూడా మీ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడండి.

సాధారణ నిద్రవేళను సెట్ చేయడానికి జాగ్రత్తగా ఉండండి. గర్భధారణకు ఇది చాలా ముఖ్యం. తెల్లవారుజాము వరకు నిద్ర గురించి చింతించకుండా కచ్చితమైన సమయాన్ని అలవాటు చేసుకోండి. మీరు ఫోన్ స్క్రీన్‌ వాడకం తగ్గించాలి. ఇది తరచుగా మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. నిద్రకు ముందు కాఫీ వంటి వాటిని తీసుకోవద్దు. సరిగ్గా విశ్రాంతి తీసుకోవడానికి జాగ్రత్త వహించండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, ధ్యానం చేయడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది.

Whats_app_banner