నిద్రకు మేలు చేసే మెలటోనిన్‍ పెరిగేందుకు తోడ్పడే ఫుడ్స్ ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 28, 2024

Hindustan Times
Telugu

మెరుగైన నిద్ర పట్టేందుకు మెదడులో పీనియల్ గ్రంధి  ఉత్పత్తి చేసే మెలటోనిన్ హార్మోన్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఆ మెలటోనిన్‍ పెరిగేందుకు ఉపయోగపడే ఐదు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

టార్ట్ చెర్రీలు మెలటోనిన్ ఉత్పత్తిని అధికం చేయగలవు. ఈ పండ్లను తిన్నా.. జ్యూస్ తాగినా నిద్ర మెరుగ్గా పట్టేందుకు ఉపయోగపడతాయి. 

Photo: Pexels

కోడిగుడ్లను తినడం ద్వారా కూడా మెలటోనిన్ అధికమవుతుంది. ఐరన్, ప్రోటీన్ లాంటి చాలా పోషకాలు కూడా ఉంటాయి. మెరుగైన నిద్రకు గుడ్లు కూడా ఉపకరిస్తాయి. 

Photo: Pexels

గోరువెచ్చని పాలు తాగడం వల్ల కూడా మెలటోనిన్ పెరుగుతుంది. నిద్రలేమికి ఇది మెరుగైన పరిష్కారంగా ఉంటుంది. గోరువెచ్చిన పాలు తాగడం వల్ల మంచి నిద్ర పట్టే అవకాశాలు పెరుగుతాయి. 

Photo: Pexels

బాదం, పిస్తా పప్పుల్లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కావాల్సిన మినరల్స్ వీటి ద్వారా లభిస్తాయి. దీంతో ఈ నట్స్ తీసుకున్నా నిద్రకు మేలు జరుగుతుంది. 

Photo: Pexels

సాల్మోన్, సార్డైన్స్ లాంటి చేపల్లో తింటే మెలటోనిన్ పెరుగుతుంది. వీటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఓవరాల్ ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు చేకూరుస్తాయి.

Photo: Pexels

చలికాలంలో పెదవులు పొడిబారడం సహజం. కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పెదవులు పగిలి ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు రక్తస్రావం కావొచ్చు. శీతాకాలంలో పెదవుల సంరక్షణకు ఈ చిట్కాలు పాటించండి.  

pexels