రాత్రుళ్లు నిద్ర పట్టడంలేదా? మంచంతో కుస్తీ పడుతున్నారా? అయితే నిద్ర పెట్టేందుకు ఈ 6 ఆహారాలు ప్రయత్నించండి.
pexels
By Bandaru Satyaprasad May 29, 2024
Hindustan Times Telugu
రాత్రుళ్లు సరిగా నిద్రపట్టడంలేదా? మీరు నిద్రపోవడానికి సహాయపడే ఆహారాలను ప్రయత్నించండి. ఈ ఆహారాలు శరీరానికి శక్తినివ్వడంతో పాటు ప్రశాంతమైన నిద్రకు సహాయపడతాయి.
pexels
గోరు వెచ్చని పాలు - పాలలో ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ గా మారుతుంది. ఇది విశ్రాంతి, నిద్రను ప్రోత్సహిస్తుంది.
కివీ ఫ్రూట్ - కివీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సెరోటోనిన్ విడుదలకు సహాయపడతాయి. మీరు చిన్నపిల్లల్లా నిద్రపోవడానికి ఇవి మీకు సహాయపడతాయి.
pexels
చమోమిలే టీ - చమోమిలే టీ ప్రశాంతత లక్షణాలకు ప్రసిద్ధి. మీ ఆందోళన తగ్గించడానికి, నిద్రను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.
pexels
బాదం, వాల్ నట్స్ - వాల్ నట్స్, బాదం వంటి గింజలు మెలటోనిన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు.. సెరోటోనిన్ లను ప్రేరేపించి నిద్రను ప్రోత్సహిస్తాయి.
pexels
చేపలు -సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కు మూలాలు. ఇవి నిద్ర నాణ్యతను పెంచుతాయి.
pexels
చెర్రీస్ -టార్టీ ఫ్రూట్ చెర్రీస్ లో మెలటోనిన్, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇది మీకు కలత చెందని నిద్ర పొందడంతో సహాయపడుతుంది.
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి