Cholesterol: వంటకోసం ఏ నూనె వాడితే మంచిది? కొలెస్ట్రాల్ కరిగించి, ఆరోగ్యం పెంచేదిదే-know which is best cooking oil this oil reduces cholesterol and improves heart health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cholesterol: వంటకోసం ఏ నూనె వాడితే మంచిది? కొలెస్ట్రాల్ కరిగించి, ఆరోగ్యం పెంచేదిదే

Cholesterol: వంటకోసం ఏ నూనె వాడితే మంచిది? కొలెస్ట్రాల్ కరిగించి, ఆరోగ్యం పెంచేదిదే

Koutik Pranaya Sree HT Telugu
Sep 29, 2024 08:00 AM IST

Cholesterol: మీ గుండె ఆరోగ్యం పెంచి, కొలెస్ట్రాల్, బరువు తగ్గించి, ఆరోగ్యం పెంచే వంట నూనె ఏంటో తెలుసా? వంటకోసం వాడాల్సిన ఉత్తమ నూనె గురించి నిపుణులు ఏమంటున్నారో చూడండి. కొలెస్ట్రాల్ కరిగించి ఆరోగ్యం పెంచే వంట నూనె ఇదే.. వాడటం మొదలు పెట్టండి

వంటకు ఏ నూనె మంచిది?
వంటకు ఏ నూనె మంచిది? (Pexels)

సరైన వంటనూనె ఎంచుకుంటే కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి, గుండె ఆరోగ్యం పెరుగుతుంది. రోజూవారీ వంటల్లో వాడే నూనె మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలికంగా శరీరానికి మేలు చేసినట్లే. నూనెల్లో రకరకాలుంటాయి. వీటిలో మీ గుండెకు, ఒంటికి మేలు చేసేవేవో నిపుణుల సలహాలు తెల్సుకుందాం.

సరైన నూనెకు ఈ లక్షణాలుండాలి?

మనం తినే నూనె గుండె ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపుతుంది. కొలెస్ట్రాల్ స్థాయుల్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం లోని పోషకాలనూ తక్కువా, ఎక్కువా చేస్తుంది. మనం వాడే నూనెలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయుల్ని పెంచాలి. అంటే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెంచి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించాలి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండాలి. ఇవన్నీ రక్త నాళాలు దెబ్బ తినకుండా కాపాడతాయి. అలాంటి నూనెలేంటో వాటిలో మనం వాడదగ్గ నూనె ఏదో చూద్దాం.

ఆరోగ్యమైన గుండె రహస్యం:

సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్‌ను.. మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో భర్తీ చేయడం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ లక్షణాలున్న నూనెల్ని వంటకోసం ఎంచుకోవాలి. ఆలివ్, కొబ్బరి, సన్ ఫ్లవర్ నూనెల్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లుంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడతాయి. కాకపోతే ఈ కోల్డ్ ప్రెస్డ్ నూనెలన్నింటి ధర కాస్త ఎక్కువే. అవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవు. ఈ నూనెలు ఆహారాన్ని పోషకభరితం చేస్తాయి. అయితే వీటన్నింటిలో ఉత్తమ మైన నూనె ఏదంటే..

స్వచ్ఛమైన కొబ్బరి నూనె
స్వచ్ఛమైన కొబ్బరి నూనె (Shutterstock)

కొబ్బరి నూనె ఎందుకు?

ఎన్ని రకాల నూనెలు ఉన్నా కోల్డ్ ప్రెస్డ్ లేదా గానుగ పట్టిన కొబ్బరి నూనె వాడటం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛమైన కొబ్బరి నూనె జీవక్రియ రేటు పెంచుతుంది. బరువు తగ్గించడంలో సాయపడుతుంది. దాంతో గుండె ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని సరిచేసి టైప్ 2 డయాబెటిస్ రాకుండానూ చూస్తుంది. ఈ వ్యాధి గుండె జబ్బులు రావడానికి కారణమయ్యే వాటిలో ముఖ్యమైంది.

కొబ్బరి నూనెకు స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆలివ్ నూనె లాంటి వాటిని ఎక్కువ వేడి మీద చేసే వంటల కోసం వాడకూడదు. అవి ప్రమాదకరమైన అనారోగ్యాలకు కారణం అవుతాయి. కొబ్బరి నూనెకున్న ఈ స్మోకింగ్ పాయింట్ వల్ల డీప్ ఫ్రైలు, స్టిర్ ఫ్రై, రోస్టింగ్ లాంటివి చేసినా ప్రమాదం లేదు. వీటన్నింటికీ నప్పే నూనె ఇది. ఎక్కువ వేడి మీద వండినా పోషకాలు కోల్పోని నూనె కొబ్బరి నూనె. కాబట్టి మీ రోజూవారీ వంటల్లో కొబ్బరి నూనె వాడకం ఈ రోజు నుంచే మొదలు పెట్టొచ్చు. మీ గుండెను ఆరోగ్యాన్ని కాపాడటంలో కొబ్బరి నూనె కీలకపాత్ర పోషిస్తుంది.

టాపిక్