ఆలివ్ పండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆలివ్ లో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. వీటిల్లో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
pexels
By Bandaru Satyaprasad Jul 16, 2024
Hindustan Times Telugu
ఆలివ్స్.. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండ్లలో విటమిన్ ఎ, కాపర్, కాల్షియం, ఐరన్‌తో పాటు విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి.
pexels
యాంటీ ఆక్సిడెంట్లు- ఆలివ్ లోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆలివ్ రక్తంలోని గ్లూటాతియోన్ స్థాయిలను పెంచుతుంది.
pexels
గుండె ఆరోగ్యానికి - ప్రతిరోజూ తక్కువ మోతాదులో ఆలివ్‌లను తీసుకోవడం వల్ల మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు. ఆలివ్‌లోని ఒలిక్ యాసిడ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
ఎముకలను దృఢంగా చేస్తుంది- ఆలివ్ బోలు ఎముకల వ్యాధిని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆలివ్స్ ఎముక మినరల్ డెన్సిటీ, ఎముక బయోమెకానికల్ బలానికి సహాయపడుతుంది. ఆలివ్‌లలో ఉండే పాలీఫెనాల్స్, ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో, ఎముక పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి.
pexels
క్యాన్సర్‌ను నివారించవచ్చు - ఆలివ్, ఆలివ్ ఆయిల్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఒలేయిక్ యాసిడ్ కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ వినిగిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం 31% తక్కువగా ఉంటుంది. ఒలిక్ యాసిడ్ రొమ్ము, పెద్దపేగు, కడుపులో ఉండే క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది.
pexels
ఆలివ్, ఆలివ్ ఆయిల్‌లోని ఒలియోకాంతల్ అల్జీమర్స్ వ్యాధి, ఇతర మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మెదడు నుంచి కణాల పనితీరుకు అంతరాయం కలిగించే అమిలాయిడ్-బీటాను క్లియర్ చేస్తుంది.
pexels
మధుమేహాన్ని నివారించవచ్చు - ఆలివ్ ఆయిల్ శరీరం షుగర్‌ని నియంత్రించి టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఆలివ్స్ లోని కొవ్వులు మీ ఆహారంలో చక్కెరను ప్రాసెస్ చేయడంలో సహాయపడతాయి.
pexels
చర్మ ఆరోగ్యానికి - ఆలివ్ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్, విటమిన్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఆలివ్ నూనెను మాయిశ్చరైజర్, ఎక్స్‌ఫోలియేటర్, ఐ మేకప్ రిమూవర్, ఫేస్ మాస్క్, రింక్ల్ ట్రీట్‌మెంట్, స్కార్ ఆయిల్‌గా ఉపయోగించవచ్చు.
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి