Fitness at home: జిమ్ వెళ్లే సమయం, బడ్జెట్ లేవా? ఇంట్లో ఈ పనులు చేస్తే అవే ఫలితాలు-know how to do gym like workout at home without spending money ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fitness At Home: జిమ్ వెళ్లే సమయం, బడ్జెట్ లేవా? ఇంట్లో ఈ పనులు చేస్తే అవే ఫలితాలు

Fitness at home: జిమ్ వెళ్లే సమయం, బడ్జెట్ లేవా? ఇంట్లో ఈ పనులు చేస్తే అవే ఫలితాలు

Koutik Pranaya Sree HT Telugu
Jul 14, 2024 06:00 AM IST

Fitness at home: బరువు తగ్గాలనుకునే వారిలో మీరు కూడా ఒకరైతే, కానీ జిమ్ లో గంటల తరబడి చెమటలు పట్టించే సమయం లేకపోతే కొన్ని ఫిట్ నెస్ చిట్కాలు తెల్సుకోండి.

ఇంట్లోనే వర్కవుట్స్
ఇంట్లోనే వర్కవుట్స్

శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలనుకునే వారిలో మీరు కూడా ఉంటే జిమ్ కు వెళ్లాలనే ఆలోచన వచ్చే ఉంటుంది. కానీ వెళ్లడానికి ఎంత ప్రయత్నించినా సమయం, బడ్జెట్ సరిపోకపోవచ్చు. కాబట్టి టెన్షన్ వదిలేసి ఈ సులభమైన ఫిట్ నెస్ టిప్స్ ను అనుసరించడం ప్రారంభించండి. ముఖ్యంగా మహిళలకు జిమ్ కోసం సమయం కేటాయించడం మరింత కష్టం. ఇంటి పనులు, ఆఫీసును మేనేజ్ చెయ్యడంలోనే నిమగ్నం అవుతున్నారంతా..

ఈ నిర్లక్ష్యం వల్ల ఊబకాయం, బీపీ వంటి జీవనశైలి సమస్యలు ముందుగానే చుట్టుముడతాయి. కానీ ఈ రోజు మేము మీతో చెప్పబోయే ఫిట్ నెస్ చిట్కాల కోసం జిమ్ వెళ్లక్కర్లేదు. డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. కొన్ని పనుల ద్వారా కేలరీలను సింపుల్ గా కరిగించుకోవచ్చు. అవేంటో చూడండి.

జంపింగ్ రోప్:

జంపింగ్ రోప్ లేదా స్కిప్పింగ్ చేయడం వల్ల మీ శరీరంలోని ముఖ్య భాగాల్ని బలోపేతం చేస్తుంది. ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి, కండరాలను దృఢం చేయడానికి సహాయపడుతుంది. జంపింగ్ రోప్ మీ కోర్, కాలి కండరాలను బలోపేతం చేస్తుంది. రోజుకు కనీసం 50-100 సార్లు జంప్ చేయడం వల్ల ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

ఇంటి పనులతో:

ఇంట్లో రోజూవారీ పనులను చేసుకుంటే చాలా రకాల వర్కవుట్లు అయిపోతాయి. ముఖ్యంగా బట్టలు ఉతికితే శరీరంలో చాలా కండరాలు పనిచేస్తాయి. బట్టలను చేతితో ఉతకడం, పిండడం ఆరబెట్టడం గొప్ప వ్యాయామం. ఇలా చేయడం వల్ల 100 నుంచి 200 కేలరీలు బర్న్ అవుతాయి.

అలాగే ఇల్లు తుడవడానికి మాప్ బదులుగా పాతకాలం పద్ధతి పాటించండి. అంటే కూర్చుని ముందుకు కదులుతూ తుడుస్తూ వెళ్లండి. ఇది ముఖ్యంగా మహిళల్లో మంచి వ్యాయామం.

కూరగాయలు కట్ చేయడానికి కత్తి బదులుగా కత్తిపీట వాడండి. దీంతో రెండు చేతులకూ వ్యాయామం అవుతుంది. కూర్చుంటూ లేస్తూ ఉండాలి కాబట్టి కేలరీలు కూడా ఎక్కువ బర్న్ అవుతాయి. ఒక రకమైన స్వ్కాట్స్ అనుకోండివి.

గదులు ఊడవడానికి బాగా వంగండి. మీకు ఏ శ్రమా ఇవ్వండి పొడవాటి చీపుర్లకు బదులు పాతకాలంలో వాడే ఈత చీపుర్లు, పొట్టి చీపుర్లు వాడండి. మీరు వండి ఊడ్చినప్పుడు మంచి వ్యాయామం అవుతుంది. 

ఇవన్నీ ఫిట్‌నెస్ కోసం ఇంటి పనుల్లో మీరు పాటించదగ్గ చిట్కాలు. జిమ్ కు ప్రత్యేకంగా సమయం కేటాయించలేకపోతే మీరు చేసే పనుల్లో మార్పులు చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. 

మెట్లు ఎక్కడం మరియు దిగడం:

ఆఫీసుల్లో, ఇంట్లో పైకి కిందికి వెళ్లడానికి లిఫ్టు వాడటం పూర్తిగా మానేయండి. బదులుగా మెట్ల మార్గానికి ప్రాధాన్యం ఇవ్వండి. మీరు మెట్లు ఎక్కడం, దిగడం వల్ల కాళ్ల కండరాలు బలపడటంతో పాటు ఎముకలు ఆరోగ్యంగా ఉండి పాదాల కింది భాగాన కండరాలు కూడా దృఢంగా మారతాయి. కాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

డ్యాన్స్:

మీ మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా డ్యాన్స్ గొప్ప కార్డియో వ్యాయామం కూడా. డ్యాన్స్ కోసం, మీరు ఇంట్లో భాంగ్రా, జుంబా లేదా ఏదైనా నృత్యం రకాన్ని అభ్యసించడం ద్వారా చాలా కిలోల బరువు తగ్గవచ్చు.

బాత్రూమ్ క్లీనింగ్:

బాత్రూం క్రమం తప్పకుండా శుభ్రపరచడం మీ మొత్తం శరీరానికి వ్యాయామం. ఇలా చేయడం వల్ల బాత్రూమ్ బ్యాక్టీరియా ఫ్రీగా ఉండటమే కాకుండా 150 నుంచి 300 క్యాలరీలు బర్న్ అవుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం