Cardiovascular workouts: కార్డియో వ్యాయామాలు ఎందుకు చేయాలి? ఎంతసేపు చేయాలి?
Cardiovascular workouts: కార్డియో వ్యాయామాల గురించి వినే ఉంటారు. ఇవి చేయడం చాలా అవసరం.
Cardiovascular workouts: వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. కాబట్టి గుండె కోసం, శ్వాస కోశ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంది. అవే కార్డియో వాస్కులర్ వ్యాయామాలు. గుండె వ్యవస్థను, శ్వాసకోశ వ్యవస్థను పటిష్టం చేసే వ్యాయామాలు ఇవి. రక్తాన్ని పంపు చేసేందుకు ఇవి గుండె సామర్ధ్యాన్ని పెంచుతాయి. అలాగే ఊపిరితిత్తులు సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. శరీరం అంతా ఆక్సిజన్ ప్రసరించే విధంగా గుండె పనితీరును మారుస్తాయి. అందుకే కార్డియో వ్యాయామాలు చేయాలని చెబుతారు. వారంలో రోజుకు కనీసం 30 నిమిషాల పాటు కార్డియో వ్యాయామాలు చేయడం చాలా అవసరం. ఇప్పటి కాలంలో గుండె కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకి అరగంట పాటు ఈ కార్డియో వ్యాయామాలు చేయడం నేర్చుకోవాలి.
కార్డియో వ్యాయామాలు అంటే...
ఈ వ్యాయామాలు చేయడం వల్ల బరువు కూడా త్వరగా తగ్గొచ్చు. కార్డియో వ్యాయామాల్లో భాగంగా స్ట్రెచింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటివి చేస్తారు. ఈ మూడు కూడా జిమ్‌కు వెళ్లి నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతిరోజు అరగంట పాటు చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. అలాగే గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులు మరింత ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. ఈ కార్డియో వ్యాయామాలు చేసేవారు రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు. బరువులు ఎత్తడమే వ్యాయామం కాదు, పుషప్స్, క్రంచెస్, స్కౌట్స్ ఇలా చాలా వ్యాయామాలు ఉంటాయి. ఇవి చేయడం వల్ల బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఈ రెండు ముఖ్యమైనవి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి ఎంతో సహకరిస్తాయి.
జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారు ప్రతి రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేయడం, వాకింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, టెన్నిస్ ఆడడం వంటివి చేయాలి. ఇవి కూడా వ్యాయామాల కిందకే వస్తాయి. అలాగే క్యాలరీలు కూడా బర్న్ అవుతాయి. ఇవి బరువును తగ్గడానికి సహకరిస్తాయి. అధిక బరువు, ఊబకాయం బారిన పడినవారు ప్రతిరోజూ వీటిని చేయడం చాలా అవసరం.
ఇంట్లో కూడా కార్డియా వ్యాయామాలు సులువుగా చేసుకోవచ్చు. మెట్లపై నుంచి పరిగెత్తడం, మెట్లు ఎక్కడం, దిగడం వంటివి, ఇంటి ముందే సైకిల్ తొక్కడం, హాల్లోనే నడవడం వంటివి కూడా చేయచ్చు. ఇవి అందరిని ఫిట్ గా ఉంచేందుకు సహకరిస్తాయి. వయసుతో సంబంధం లేకుండా వీటిని ప్రతిరోజూ చేయడం అవసరం. అయితే మొదట్లో ఫిట్‌నెస్ ట్రైనర్ల సహకారం తీసుకోవడం మంచిది. శారీరకంగా, మానసికంగా కార్డియో వ్యాయామాలు మిమ్మల్ని బలంగా చేస్తాయి. ముఖ్యంగా ఈ వ్యాయామాల్ని ఉదయాన్నే చేయాలి. సాయంత్రం పూట చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఉదయం పూట కుదరని వాళ్లు మాత్రమే సాయంత్రం చేయాలి.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా కార్డియా వ్యాయామాలు సహకరిస్తాయి. అలాగే ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇవి మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మనసు తేలిక పరిచి, ఏకాగ్రతను పెంచుతుంది.