కూర్చోవడం, నిలబడటం లేదా నడవడం ఆరోగ్యానికి ఆరోగ్యకరమైనది. కానీ దాని సమతుల్యతను కాపాడుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. మొత్తం ఆరోగ్యం మరియు వ్యాధి నివారణ కోసం, ఎక్కువ నిలబడి లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు క్రమం తప్పకుండా శారీరక శ్రమను అనుసరించడంతో పాటు మీ శరీర అవసరాలను వినాలి. ఈ వ్యాసంలో, ఎన్ని గంటలు కూర్చోవడం, నిలబడటం మరియు నడవడం ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయో తెలుసుకోండి.
శారీరక శ్రమ లేకుండా రోజంతా కూర్చోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉంది. టైప్ 2 డయాబెటిస్‌తో పాటూ మరి కొన్ని రకాల క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ పెరుగుతుంది. రోజూ 4 గంటల కంటే తక్కువ సమయం కూర్చునేవారికి సమస్యలు తక్కువగా వస్తాయని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో, ప్రతిరోజూ 4-8 గంటలు కూర్చునేవారికి ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 8-11 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులకు సమస్యలు వచ్చే ప్రమాదం ఇంకా ఎక్కువే. వీటి నుంచి బయటపడాలంటే శారీరక కదలిక, వ్యాయామాలు ముఖ్యం. ఇవి కదలకుండా కూర్చోవడం వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి.
రోజుకు కనీసం 2 గంటలు నిలబడటానికి ప్రయత్నించాలని నివేదికలు చెబుతున్నాయి. 4 గంటలు నిలబడి ఉండగలిగితే మరీ మంచిది. 2 నుంచి 4 గంటలు నిలబడాలి అంటే మీరలాగే నిలబడి ఉండాలని కాదు. రోజు మొత్తం మీద వాకింగ్ సమయంలోనే, పనులు చేసుకునేటప్పుడో నిలబడి చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీ కారు లేదా బైక్ ఆఫీసుకు దూరంగా పార్క్ చేయడానికి ప్రయత్నించండి.
దాంతో మీరు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొద్దిగా అయినా నడవగలరు. ఫోన్ వస్తే పడుకోకుండా నడుస్తూ మాట్లాడండి. ఆఫీసులోని ప్రతి అంతస్తులో వాష్ రూమ్ ఉంటే, మీ డెస్క్ కు దూరంగా ఉండే వాష్ రూమ్ ఉపయోగించండి. కొన్ని చిన్న చిన్న రోజువారీ అలవాట్లు మీ జీవనశైలిని మీకు తెలీకుండానే మెరుగుపరుస్తాయి. ఎక్కువసేపు నిలబడటం కష్టం కావచ్చు, కానీ ఎక్కువసేపు కూర్చోవడం మాత్రం మరీ చేటు చేస్తుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తూ పనులు చేసుకోండి.
వారంలో కనీసం ఐదు రోజులైనా, ప్రతి రోజూ 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ నడవడం మీ ఆరోగ్యానికి మంచిది. కానీ దానికోసం కేవలం మీరు వేసే అడుగుల సంఖ్య, సమయం ఒక్కటే పరిగణలోకి తీసుకోకూడదు. మీరు నడిచిన దూరం ముఖ్యం. కాబట్టి ప్రతిరోజూ ఒక కిలోమీటరు నడవడానికి ప్రయత్నిస్తే మంచిది.