Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు-just eat two amla fruits a day and your liver will not have any problem ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amla And Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Haritha Chappa HT Telugu
May 18, 2024 04:30 PM IST

Amla and Liver Health: ఉసిరికాయలు చూడటానికి చిన్నగా ఉన్నా అవి మనకు మీరు చేసే మేలు ఎంతో ఎక్కువ. మన కాలేయాన్ని కాపాడే శక్తి ఉసిరికాయలకు ఉంది. కాబట్టి ఆహారంలో వీటిని భాగం చేసుకోండి.

ఉసిరికాయలు
ఉసిరికాయలు (Pixabay)

Amla and Liver Health: ఉసిరికాయలని ఇండియన్ గూస్‌బెర్రీలు అంటారు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజూ రెండు ఉసిరికాయలను తినండి చాలు. మనకి కావాల్సిన ఎన్నో పోషకాలు అందడంతో పాటు కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం కోసం ప్రత్యేకంగా ఈ ఉసిరికాయలను తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. జీర్ణ క్రియకు సహకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియాల నుండి కాపాడతాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటాయి. ఆక్సికరణ ఒత్తిడి నుండి బయట పడేస్తాయి.

ఉసిరి తింటే ఈ వ్యాధులు దూరం

ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధులు, సిరోసిస్ వంటి వ్యాధుల నుంచి కాపాడే శక్తి ఉసిరికి ఉంది. ఈ వ్యాధులు రావడానికి ముఖ్య కారణం ఆక్సీకరణ ఒత్తిడి. ఆ ఒత్తిడిని తగ్గించే శక్తి ఉసిరికి మాత్రమే ఉంది.

కాలేయాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో, డీటాక్స్ఫికేషన్ చేయడంలో ఉసిరి ముందుంటుంది. రక్తంలోని వ్యర్థాలను, విషాలను ఫిల్టర్ చేసే ఉద్యోగం కాలేయానిది. ఇక కాలేయాన్ని కాపాడే శక్తి ఉసిరికి ఉంది. కాబట్టి కాలేయం చక్కగా పని చేయాలంటే రోజుకు రెండు ఉసిరికాయలను తినడం అలవాటు చేసుకోవాలి.

ఉసిరికాయల్లో టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను చాలా వరకు తగ్గిస్తుంది. ఉసిరికాయలో ఫైటో కెమికల్స్ ఎన్నో ఉంటాయి. ఇవి దెబ్బతిన్న కాలేయ కణాలను రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. కాలేయం దెబ్బతినకుండా అడ్డుకునే శక్తి ఉసిరిలోని పోషకాలకి ఉంది.

అధిక కొలెస్ట్రాల్...

రక్తంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోతే అది కాలేయానికి ఎంతో ప్రమాదం. రక్తంలో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కాలేయంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. దీనివల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఉసిరిని తినడం వల్ల కాలేయంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది. వాటిని శరీరం నుండి తొలగించేందుకు సహకరిస్తుంది. దీనివల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోదు. ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి.

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఉసిరికాయలను తినాలి. మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత అనేవి కాలేయ ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కాలేయానిదే ముఖ్యపాత్ర. ఉసిరి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

కాలేయం కోసం రోజుకు రెండు ఉసిరికాయలు తినడంతో పాటు ఆల్కహాల్, ధూమపానం, డ్రగ్స్ వంటివి మానేయాలి. అలాగే గాలి కాలుష్యం అధికంగా ఉన్నప్పుడు మాస్కులు ధరించాలి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ చేరితే అధిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను దూరం చేసేందుకు ఉసిరిని తింటూ ఉండాలి. ఉసిరికాయ ఎంతగా తింటే కాలేయవ్యాధుల ప్రమాదం అంతగా తగ్గుతుంది.

టాపిక్