Usiri Pachadi: ఉసిరి పచ్చడి ఇలా స్పైసీగా చేయండి, వేడివేడి అన్నంలో అదిరిపోతుంది-usiri pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Usiri Pachadi: ఉసిరి పచ్చడి ఇలా స్పైసీగా చేయండి, వేడివేడి అన్నంలో అదిరిపోతుంది

Usiri Pachadi: ఉసిరి పచ్చడి ఇలా స్పైసీగా చేయండి, వేడివేడి అన్నంలో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
May 04, 2024 05:30 PM IST

Usiri Pachadi: ఉసిరికాయతో చేసే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీన్ని చేసుకుంటే నాలుగు రోజుల పాటు తాజాగా ఉంటుంది.

ఉసిరికాయ పచ్చడి రెసిపీ
ఉసిరికాయ పచ్చడి రెసిపీ

Usiri Pachadi: ఉసిరికాయలతో చేసే పచ్చడి రుచిలో అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుంటే ఆ రుచే వేరు. దీన్ని చేయడం చాలా సులువు. ఒక్కసారి చేస్తే నెలరోజుల పాటు తాజాగా నిండి ఉంటుంది. ఉసిరి పచ్చడి సులువుగా ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. ఈ రెసిపీ ఫాలో అయిపోండి.

ఉసిరి పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉసిరికాయలు - ఐదు

పచ్చి శెనగపప్పు - పావు కప్పు

వెల్లుల్లి రెబ్బలు - ఐదు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె తగినంత - ఆవాలు

జీలకర్ర - ఒక స్పూను

పచ్చిమిర్చి - మూడు

పసుపు - పావు స్పూను

ఇంగువ - చిటికెడు

ఆవాలు - అర స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

నూనె - తగినంత

ఉసిరి పచ్చడి రెసిపీ

1. పచ్చిశనగపప్పును నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

2. తర్వాత ఉసిరికాయలను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

4. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపవచ్చు.

5. ఇప్పుడు గ్రైండ్ అయిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

6. రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలపాలి.

7. ఇప్పుడు ఈ పచ్చడి కి తాళింపు పెట్టేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

8. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

9. తర్వాత పసుపు, కరివేపాకులు, ఇంగువ కూడా వేసి కలపాలి.

10. ఆ మొత్తం మిశ్రమాన్ని పచ్చడిలో వేసుకోవాలి.

11. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అంతే ఉసిరి పచ్చడి రెడీ అయినట్టే.

12. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. ఇది నిల్వ పచ్చడి కాదు, ఒకసారి చేసుకుంటే రెండు నుంచి మూడు రోజులు తాజాగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇది వీలైనది.

ఉసిరి మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉంటుంది. రోజుకు ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థకు బలాన్ని అందించవచ్చు. ఉసిరికాయలు దొరికితే ఇంట్లో కొని పెట్టుకోండి. అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది.

టాపిక్