Women Diseases: ఈ వ్యాధులు ఉన్న మహిళలకు పిల్లలు పుట్టడం చాలా కష్టం, ఇవి రాకుండా జాగ్రత్త పడండి
Women Diseases: మహిళల జీవితంలో తల్లి కావడం అనేది ఒక ముఖ్యమైన అంశం, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వారిని అమ్మతనానికి దూరం చేస్తున్నాయి.
Women Diseases: పాప్‌స్టార్ సెలీనా గోమేజ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆమె అనారోగ్యం కారణంగా తాను ఎప్పటికీ తల్లి కాలేనని చెప్పింది. ఒక ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆమెను తల్లితనానికి దూరం చేసింది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. దాని పేరు లూపస్. ఇలాంటి వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అవి మహిళలకు తల్లితనాన్ని దూరం చేస్తున్నాయి.
లూపస్
సెలీనా గోమేజ్‌కు లూపస్ వ్యాధి ఉన్నట్లు పదేళ్ల క్రితమే నిర్ధారణ అయింది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సొంత అవయవాలపైనే దాడి చేస్తుంది. ఈ లూపస్ వచ్చిన వారిలో మోకాళ్లు, ఊపిరితిత్తులు, చర్మంతో సహా ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూత్రపిండాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. మూత్రపిండాలు ఫెయిల్ అయ్యి కిడ్నీ మార్పిడి చేయించాల్సిన పరిస్థితి వస్తుంది.
లూపస్‌తో పాటూ అనేక ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నాయి. అలాగే ఇతర వ్యాధులు కూడా మహిళలకు పిల్లల పుట్టకుండా అడ్డుకుంటాయి.
ఆటో ఇమ్యూన్ వ్యాధులు
లూపస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువే ఉన్నాయి. వీటిని స్వయం ప్రతిరక్షక వ్యాధులు అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా గర్భ సమస్యలను పెంచుతాయి. యాంటీ పాస్పోలిపిడ్ సిండ్రోమ్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి కూడా మహిళలను గర్భం దాల్చకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని రోగనిరోధక శక్తి ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేస్తుంది. దీని వల్ల గర్భస్రావం కావడం, గర్భం ధరించడంలో ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే మందులను, చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల గర్భం దాల్చడం దాదాపు అసాధ్యం.
ఎండోమెట్రియోసిస్
ఎండోమెట్రియం అంటే గర్భాశయంలోని లోపలి పొర. ఎండోమెట్రియోసిస్ అనేది అండాశయాలు, ట్యూబ్స్ వంటి బాహ్య అవయవాలపై పెరిగే భాగం. ఇది పెరిగితే పొట్ట నొప్పిగా అనిపిస్తుంది. పిల్లలు పుట్టడం కూడా కష్టమవుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ వ్యాపిస్తుంది. ఎండోమెట్రియోసిస్ కు చికిత్స వుంది. దీనివల్ల హార్మోన్ల చికిత్స, ఆపరేషన్ వంటివి పడవచ్చు. దీనివల్ల గర్భం ధరించడం కష్టంగా మారుతుంది.
ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలు
ఫెలోపియన్ ట్యూబుకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మహిళల్లో గర్భం రావడం చాలా కష్టం. ఈ ట్యూబుల వల్ల అండం, స్పెర్మ్ కలవలేవు. దీనివల్ల గర్భం దాల్చే అవకాశం తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల ఆపరేషన్ల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్
దీన్ని PCOS అని పిలుస్తారు. ఇది ఎంతో మంది మహిళల్లో పిల్లలు కలగకుండా చేస్తోంది. హార్మోన్ల అసమతుల్యత, అండాశయాల్లో చిన్న చిన్న తిత్తులు ఏర్పడడం, నెలసరి కాకపోవడం వంటి సమస్యల వల్ల పిసిఒఎస్ వస్తుంది. అండోత్సర్గము కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల గర్భం రావడం కష్టతరంగా మారుతుంది. హార్మోన్ల చికిత్స ద్వారా కొన్ని రకాల మందులు, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా పిసిఒఎస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
గర్భాశయంలో సమస్యలు
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ లేదా పాలిప్స్ వంటివి ఏర్పడడం వల్ల గర్భం ధరించకుండా మారిపోతారు. ఫైబ్రాయిడ్స్ గర్భాశయ కండరంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇవి గర్భాశయ ఆకృతిని, పనితీరును మార్చేస్తాయి. వీటివల్ల గర్భం ధరించడం కష్టంగా మారుతుంది.
ప్రపంచంలో 90 శాతం మంది మహిళలు పైన చెప్పిన ఆరోగ్య సమస్యల కారణంగానే గర్భం ధరించలేకపోతున్నారు.