Rava Garelu: గారెలు తినాలనిపిస్తే ఇలా ఉప్మారవ్వతో అప్పటికప్పుడు చేసేసుకోండి, మినపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు-if you want to eat garelu do it with upma ravva know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rava Garelu: గారెలు తినాలనిపిస్తే ఇలా ఉప్మారవ్వతో అప్పటికప్పుడు చేసేసుకోండి, మినపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు

Rava Garelu: గారెలు తినాలనిపిస్తే ఇలా ఉప్మారవ్వతో అప్పటికప్పుడు చేసేసుకోండి, మినపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు

Haritha Chappa HT Telugu
Sep 20, 2024 05:30 PM IST

Rava Garelu: గారెలు తినేందుకు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని చేయడానికి ముందుగానే మినప్పప్పు నానబెట్టాలి. గారెలు తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఉప్మా రవ్వతో చేసుకోవచ్చు. రెసిపీ ఇక్కడ ఉంది.

ఉప్మారవ్వ గారెలు
ఉప్మారవ్వ గారెలు

Rava Garelu: గారెలు పేరు చెబితేనే ఎంతో మందికి నోరూరిపోతుంది. కానీ గారెలు చేయాలంటే అయిదు గంటల ముందే మినపప్పు నానబెట్టుకోవాలి. ఆ తరువాత రుబ్బుకుని గారెలు చేసుకోవాలి. ఈలోపు గారెలు తినాలన్న ఆలోచన కూడా పోతుంది. అందుకు గారెలు తినాలనిపించిన వెంటనే ఉప్మా రవ్వతో ఇన్ స్టెంట్‌గా చేసుకోవచ్చు. వీటి రెసిపీ చాలా సులువు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి.

రవ్వ గారెలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఉప్మా రవ్వ - రెండు కప్పులు

పెరుగు - ఒక కప్పు పెరుగు

ఉల్లిపాయ - ఒకటి

జీలకర్ర - ఒక స్పూను

అల్లం - చిన్న ముక్క

పచ్చిమిర్చి - రెండు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

పుదీనా తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - సరిపడినన్ని

నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

రవ్వ గారెలు రెసిపీ

1. రవ్వ గారెలు చేసేందుకు ఉప్మారవ్వను ఎంచుకోవాలి.

2. ఒక గిన్నెలో ఉప్మా రవ్వను వేసుకోవాలి. అందులో కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.

3. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలుపుకోవాలి.

4. రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, అల్లం తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

5. సరిపడా నీటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

6. గారెలకు ఎంత మందంగా కావాలో అంత మందంగా నీటిని కలుపుకోవాలి. ఇందులో చిటికెడు వంట సోడా వేసి కలపాలి.

7. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.

8. నూనె వేడెక్కాక పిండిని చేత్తో తీసుకుని గారెల్లా ఒత్తుకుని నూనెలో వేయాలి.

9. రెండు వైపులా రంగు మారేవరకు వేయించి తీసి టిష్యూ పేపర్ పై వేసుకోవాలి. అదనపు నూనెను పీల్చేస్తుంది.

10. వాటిని కొబ్బరి చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది.

ఉప్మారవ్వతో చేసే గారెలు కూడా మినపప్పుతో చేసే గారెలు కూడా రుచిగానే ఉంటాయి. వీటిని టమోటా చట్నీ, కొబ్బరి పచ్చడి రెండింటితోనూ టేస్టీగానే ఉంటుంది. ఇవి అందరికీ నచ్చుతాయి. వీటిని వేడిగా తింటే ఆ రుచే వేరు.

టాపిక్