Thotakura Garelu: క్రిస్పీగా స్వీట్‌కార్న్ తోటకూర గారెలు రెసిపీ, సాయంత్రం తినేందుకు బెస్ట్ స్నాక్స్
Thotakura Garelu: స్వీట్‌కార్న్ తోటకూర కలిపి చేసే గారెలు టేస్టీగా ఉంటాయి. తోటకూరతో కేవలం కూరలే కాదు గారెలు చేసుకోవచ్చు. స్వీట్‌కార్న్ తోటకూర గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి.
Thotakura Garelu: గారెలంటే ఎంతో మందికి ఇష్టం. తోటకూరతో కూడా టేస్టీగా గారెలు చేసుకోవచ్చు. స్వీట్‌కార్న్ తోటకూర గారెలు రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. సాయంత్రం పూట తినేందుకు ఇవి ఉత్తమ స్నాక్ అని చెప్పుకోవచ్చు. క్రిస్పీగా తోటకూర గారెలు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
స్వీట్‌కార్న్ తోటకూర గారెలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
స్వీట్ కార్న్ గింజలు - రెండు కప్పులు
తోటకూర కట్టలు - రెండు
వెల్లుల్లి రెబ్బుల - ఆరు
అల్లం తరుగు - అరస్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి మిర్చి - నాలుగు
బియ్యం పిండి - పావు కప్పు
ఉల్లిపాయ - ఒక స్పూను
సోంపు - పావు స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత
స్వీట్‌కార్న్ తోటకూర గారెలు రెసిపీ
1. తోటకూరను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. పచ్చిమిర్చి, జీలకర్ర, సోంపు, అల్లం, వెల్లుల్లి, స్వీట్ కార్న్ గింజలు రుబ్బుకోవాలి.
3. అవసరం అయితే కాస్త నీరు వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
4. ఆ గిన్నెలో సన్నగా తరగిన ఉల్లిపాయలు, తోటకూర తరుగు, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
6. నూనె వేడెక్కిన తరువాత పిండిని చేత్తో తీసుకుని గారెల్లా ఒత్తుకుని వేసుకోవాలి.
7. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంటే టేస్టీ తోటకూర గారెలు రెడీ అయినట్టే.
తోటకూర, స్వీట్ కార్న్ రెండూ ఆరోగ్యానికి మంచివే. ఒకసారి వీటితో గారెలు చేసుకుని చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా వీటి రుచి నచ్చుతుంది. తోటకూర తినడం వల్ల రక్త హీతన సమస్య తగ్గుతుంది. తోటకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే జింక్, విటమిన్ ఏ కూడా నిండుగా ఉంటుంది. కాబట్టి తోటకూరతో చేసిన వంటకాలు తినడం ఆరోగ్యానికి మంచిది.