Sweet corn Payasam: స్వీట్ కార్న్ పాయసం ఇలా చేస్తే అదిరిపోతుంది, చేయడం చాలా సులువు
Sweetcorn Payasam: స్వీట్ కార్న్‌తో అనేక రకాల వంటకాలు వండుతారు. ఒకసారి పాయసం వండి చూడండి. అందరికీ నచ్చుతుంది. దీని దేవుని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు.
Sweet corn Payasam: పండుగ సీజన్లలో, ఇంట్లోని ప్రత్యేక సందర్భాల్లో మొక్కజొన్నతో పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాంటి స్వీట్ తినడం వల్ల బోర్ గా అనిపిస్తుంది. స్వీట్ కార్న్‌తో పాయసం చేస్తే అద్భుతంగా ఉంటుంది. అతిథులకు కూడా ఇది నచ్చడం ఖాయం. ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ పాయసం తాగి చూడండి. రుచి మాములుగా ఉండదు. ఇది భారతీయ స్టైల్‌లో వండే క్రీమీ స్వీట్ కార్న్ డిజర్ట్.
స్వీట్ కార్న్ పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
స్వీట్ కార్న్ గింజలు - ఒక కప్పు
బెల్లం తురుము - ముప్పావు కప్పు
నెయ్యి - మూడు స్పూన్లు
యాలకుల పొడి - అర స్పూను
పాలు - అర లీటరు
స్వీట్ కార్న్ పాయసం రెసిపీ
1. స్వీట్ కార్న్ పాయసం చేయడానికి ముందుగా గింజలను శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి.
2. రెండు స్పూన్ల స్వీట్ కార్న్ గింజలను పేస్ట్ చేయకుండా పక్కన నిల్వ చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి దానిలో అర లీటర్ పాలు వేసి మరిగించాలి.
4. ఈ పాలు మరుగుతున్నప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి పక్కన పెట్టుకున్న గుప్పెడు మొక్కజొన్న గింజలను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసి మొక్కజొన్న పేస్టును కూడా వేసి ఒకటి రెండు నిమిషాలు చిన్న మంట పైన వేయించుకోవాలి.
6. ఆ పేస్ట లోనే పక్కన మరుగుతున్న పాలను కూడా తీసి వేసి కలపాలి.
7. ఇది ముద్దలు లేకుండా గరిటతో కలుపుతూనే ఉండాలి.
8. ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి.
9. ఆ తర్వాత బెల్లం తురుమును వేసి బాగా కలుపుతూ ఉండాలి.
10. అలాగే యాలకుల పొడిని కూడా వేసి కలుపుతూ ఉండాలి.
11. పైన ఒక స్పూన్ నెయ్యిని వేసి మళ్లీ బాగా కలపాలి.
12. ఇది పాయసంలాగా దగ్గరగా వస్తుంది. కాస్త చిక్కగా అవుతుంది. ఆ సమయంలో స్టవ్ కట్టేయాలి.
13. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ పైన గార్నిష్ చేసుకోవాలి. అంతే స్వీట్ కార్న్ పాయసం రెడీ అయిపోతుంది.
స్వీట్ కార్న్ తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి. కాబట్టి వాటితో ఒకసారి ఈ పాయసం చేసుకొని చూడండి. ఇది మీకు నచ్చడం ఖాయం. దీనిని నైవేద్యంగా ఉపయోగించుకోవచ్చు. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు కూడా వడ్డించవచ్చు. దీన్ని చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అరగంటలో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది.