World Tuna Day 2024: టూనా చేప రోజూ తింటే బరువు తగ్గడంతో పాటూ గుండెపోటునూ అడ్డుకోవచ్చు
World Tuna Day 2024: టూనా చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చేపలు ఎందుకు తినాలో, వీటి ప్రాముఖ్యత ఏంటో తెలియజెప్పేందుకు ప్రతి ఏడాది ‘ప్రపంచ టూనా దినోత్సవం’ నిర్వహిాంచుకుంటారు.
World Tuna Day 2024: టూనా చేపలతో అనేక రకాల వంటలు వండుకోవచ్చు. ఈ చేపలతో చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. టూనా చేపలు వినియోగం ఎక్కువైపోవడం, వాటి పెంపకం తగ్గడంతో వాటి చేపల జనాభా తగ్గిపోయింది. టూనా చేపల వేట వేలాది సంవత్సరాలుగా కొనసాగుతోంది. వాటి సంఖ్య రోజురోజుకు తగ్గతుండడంతో ఆ చేపల పెంపకంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది ప్రపంచ టూనా దినోత్సవాన్ని మే 2న జరుపుకుంటారు.
2016 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటా ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. 2017 మే నెల నుంచి ప్రపంచ ట్యూనా దినోత్సవం నిర్వహించుకోవడం ప్రారంభమైంది. అప్పటి నుండి, ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. టూనా చేపలు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అధిక బరువు సమస్య నుంచి క్యాన్సర్ వరకు అనేక రకాల రోగాలను అడ్డుకునే శక్తి టూనా చేపలకు ఉంది.
టూనా చేపలు రోజూ ఒక ముక్క తినడం అలవాటు చేసుకోవాలి. రోజూ తినడం వీలుకాని వారు వారానికి కనీసం ఒక్కసారైనా తినేందుకు ప్రయత్నించాలి. టూనా చేపలు తినడం వల్ల ఎన్నో రకాల రోగాలు అదుపులో ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం టూనా చేపలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో చేరాక చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెకు రక్త సరఫరా సవ్యంగా జరుగుతుంది. చేపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచింది. పొటాషియం ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తపోటును తగ్గించి స్ట్రోక్, గుండెపోటు వంటివి రాకుండా అడ్డుకుంటాయి.
మరో పరిశోధన ప్రకారం మీ రక్తంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంచే శక్తి టూనా చేపకే ఉంది. రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ అనారోగ్య కరమైన కొవ్వు రూపం. ఇవి గుండెకు తీవ్ర హానిని చేస్తాయి. వాటిని అడ్డుకోవాలంటే టూనా చేపను తినడం అలవాటు చేసుకోవాలి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా టూనా చేపలు చాలా అవసరం. ఈ చేపల్లో సెలీనియం, విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు కూడా టూనాలో ఉంటాయి.
టూనా చేపలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కడా క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. కాబట్టి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు చాలా ముఖ్యమైనవి. క్యాన్సర్‌ను, దీర్ఘకాలిక ఇన్ఫర్మేషన్ ను తగ్గించే శక్తి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం టూనా లేత మాంసాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ప్రోటీన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
టూనాలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. టూనాలో విటమిన్ డి కూడా ఉంటుంది. పరిశోధనల ప్రకారం టూనా చేపల్లో ఎలాస్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చర్మపు రంగును కాంతివంతంగా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి ఆరోగ్యకరమైన చర్మ కణాలు పెరిగేలా చేస్తాయి. టూనా చేపలు ఐరన్ అధికంగా ఉంటుంది. ఐరన్ శరీరంలో చేరడం వల్ల సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఎర్ర రక్త కణాల సంశ్లేషణకు విటమిన్ బి అవసరం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. మానసిక ఆరోగ్యం బాగుండాలనుకున్న టూనా చేపలు తినడం అలవాటు చేసుకోవాలి. టూనా చేపల్లో యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు ఎక్కువ. టూనాలో సెలీనియం అనే పోషకం ఉంటుంది. ఇది మానసిక ఆందోళన తగ్గించి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
టూనా చేపలు తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఎందుకంటే టూనాలో కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు ఉండవు. డయాబెటిస్ నిర్వహణకు అవసరమైన పోషకాలు అన్నీ టూనాలో ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తాయి.
టాపిక్