తెలుగు న్యూస్ / ఫోటో /
Prostate Cancer: మగవారూ జాగ్రత్త, ఇవన్నీ ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు
- Prostate Cancer: ప్రోస్టేట్ క్యాన్సర్ అనేక లక్షణాలను బయటపెడుతుంది. ఆ లక్షణాలను మగవారూ తేలికగా తీసుకోకూడదు. ఈ వ్యాధి నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది. ఇది శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది.
- Prostate Cancer: ప్రోస్టేట్ క్యాన్సర్ అనేక లక్షణాలను బయటపెడుతుంది. ఆ లక్షణాలను మగవారూ తేలికగా తీసుకోకూడదు. ఈ వ్యాధి నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది. ఇది శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది.
(1 / 5)
ప్రోస్టేట్ గ్రంథి మూత్రాశయం క్రింద ఉంటుంది. ఇది వాల్‌నట్ ఆకారంలో ఉన్న గ్రంథి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రంథి పెద్దదిగా మారినప్పుడు, అది మూత్ర సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా మూత్ర ప్రవాహం తగ్గడం వల్ల మూత్ర విసర్జనకు ఒత్తిడి ఏర్పడుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, 8 మంది పురుషులలో ఒకరికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.(Freepik)
(2 / 5)
మగవారిలో అరవై అయిదు సంవత్సరాల వయస్సు తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే అప్పుడప్పుడు ఇది యువకులలో కూడా వచ్చే అవకాశం ఉంది. (Freepik)
(3 / 5)
ప్రోస్టేట్ క్యాన్సర్ అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి నిశ్శబ్దంగా పెరుగుతుంది. ఇది శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. మూత్రం లేదా వీర్యంలో రక్తం కనిపించడం, పిరుదులు, వీపు, ఛాతీ లేదా ఇతర ఎముకలలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.(Freepik)
(4 / 5)
అలాగే కొందరి పురుషుల్లో అంగస్తంభన సమస్య కూడా రావచ్చు. ప్రోస్టేట్ గ్రంథి పెరిగి… పురీషనాళంపై ఒత్తిడి పడేలా చేస్తుంది. దీని వల్ల మలబద్దకం కూడా కలగవచ్చు. ఈ వ్యాధి కనిపిస్తే పురుషులు బరువు తగ్గి ఆకలిని కోల్పోతారు. 65 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఈ సమస్య జన్యుపరమైనది కూడా కావచ్చు. కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారి వారసులు జాగ్రత్తగా ఉండాలి. (Freepik)
ఇతర గ్యాలరీలు