Food Plate: మనం సరైన ఆహారం తినడం లేదట, మన ప్లేటులో కచ్చితంగా ఉండాల్సిన పదార్థాలేంటో చెప్పిన ఐసీఎమ్ఆర్-icmr said that we are not eating the right food but the ingredients that should be on our plate ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food Plate: మనం సరైన ఆహారం తినడం లేదట, మన ప్లేటులో కచ్చితంగా ఉండాల్సిన పదార్థాలేంటో చెప్పిన ఐసీఎమ్ఆర్

Food Plate: మనం సరైన ఆహారం తినడం లేదట, మన ప్లేటులో కచ్చితంగా ఉండాల్సిన పదార్థాలేంటో చెప్పిన ఐసీఎమ్ఆర్

Haritha Chappa HT Telugu
Sep 12, 2024 09:30 AM IST

Food Plate: భారతీయులు సరిగా తినడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) చెబుతోంది. మన ప్లేటులో ఉండాల్సిన ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలేంటో కూడా చెబుతోంది. మీరు అలా తింటున్నారో లేదో తెలుసుకోండి.

మన ఫుడ్ ప్లేటులో ఉండాల్సిన ఆహారాలు ఏమిటి?
మన ఫుడ్ ప్లేటులో ఉండాల్సిన ఆహారాలు ఏమిటి? (Pixabay)

మన శరీరానికి కావాల్సిన శక్తి కావాలంటే సమతులాహారం తీసుకోవాలి. ఏది పడితే అది తింటే శరీరం ఆరోగ్యంగా ఉండదు. సమతుల్య ఆహారం తినడం వల్ల శరీరం సరైన పనితీరు కోసం, శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరం. అలాగే శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందించడంలో కూడా సమతుల ఆహారానిదే ప్రధాన పాత్ర. మొక్కల ఆధారిత ఆహారం నుండి జంతు ప్రోటీన్ వరకు, మనం తీసుకునే ఆహారంలో అవసరమైన అన్ని పోషకాలు ఉండాలి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఇలా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్ని ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

ఎంత తినాలి?

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ అభివృద్ధి చేసిన డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్ 2024 ప్రకారం, రోజుకు 2000 కిలో కేలరీల ఆహారాన్ని ఒక వ్యక్తి తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం కోసం కొన్ని పదార్ధాలు సిఫారుసు చేసింది ఐసీఎమ్ఆర్ . మార్గదర్శకాల ప్రకారం, ఆరోగ్యకరమైన ప్లేట్లో సగం పండ్లు, కూరగాయలు ఉండాలి. మిగిలిన సగం తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, మాంసాహారం, గుడ్లు, నట్స్, పాలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సమతులాహారం మనం తీసుకుంటున్నట్టు. ఒకే భోజనంలో ఇన్ని రకాలు తినలేకపోవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్, రాత్రి డిన్నర్ లలో షేర్ చేసుకుని తినాలి.

భారతీయులు సాధారణంగా తమ ఆహారంలో తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలను ముఖ్యంగా అధికంగా తినే అలవాటును కలిగి ఉంటారు. రోజువారీ శక్తి అవసరాలకు 45 శాతం తృణధాన్యాల నుంచే తినవచ్చని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. మిగిలిన దాని కోసం, తక్కువ కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే పోషకాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు

ఐసిఎంఆర్ భారతీయులలో దీర్ఘకాలిక అనారోగ్య ఆహార విధానాల గురించి కూడా చెప్పింది. చక్కెర నిండిన పదార్థాలు, ఉప్పు వేసి ఆహారాలు, కొవ్వు పదార్థాలను అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్ చేసిన పదార్థాలను భారతీయులు తింటూ ఉంటారు. ఈ అనారోగ్యకరమైన ఆహారపు అలవాటుతో పాటు నిశ్చల జీవనశైలి, పోషక లోపం వంటతివి ఊబకాయాన్ని పెంచుతుంది.

భారతీయులు ఫుడ్ ప్రకటనలు చూసి ఎక్కువ ఆకర్షితులవుతారు. వాటినే తినేందుకు ఇష్టపడతారు. దీని వల్ల ప్రజలు పోషకాలు నిండిన ఆహారానికి దూరం అవుతున్నారు. తినే ఆహారాల్లో, పానీయాలలో, చక్కెర, సోడియం, సంతృప్త కొవ్వులు అధికంగా ఉండటం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

టాపిక్