విపరీత కరణీ ఆసనంతో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం
Viparita Karani Asanam: ఒత్తిడి, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే, ప్రతిరోజూ విపరీత కరణి ఆసనం చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగాసనం చేసే సరైన పద్ధతి, దాని ప్రయోజనాలను తెలుసుకోండి.
Benefits of Viparita Karani Asana: యోగా ఆసనాలు శారీరక, మానసిక రుగ్మతల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అలాంటి యోగాసనాలలో ఒకటి విపరిత కరణి ఆసనం. దీనిని వాల్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే వాల్ పోజ్ చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. కాబట్టి విపరీత కరణి ఆసనం ఎలా చేయాలో, ఈ ఆసనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
విపరీత కరణి ఆసనం ఎలా వేయాలి?
విపరీత కరణి యోగాసనం యోగాభ్యాసం ప్రారంభించిన వారికి సులభమైన ఆసనం. ఇది శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. వాల్ పోజ్ ఎలా చేయాలో తెలుసుకోండి
- యోగా మ్యాట్ వేసుకుని మీ వీపుపై పడుకోండి.
- మీ తుంటిని గోడకు ఆనించండి. మీ కాళ్ళను పైకి లేపండి. గోడ సపోర్ట్‌తో వాటిని నిఠారుగా చేయండి.
- మీరు మీ నడుము, తలకు సపోర్టుగా ఒక దిండును ఉపయోగించవచ్చు.
- శ్వాసపై దృష్టి పెట్టండి. లోతైన శ్వాస తీసుకోండి.
- నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చి కొంతసేపు కూర్చుని శ్వాస వ్యాయామాలు చేయండి.
- మొదట ఈ యోగాసనాన్ని ప్రతిరోజూ రెండు మూడు నిమిషాల పాటు సాధన చేయండి. అప్పుడు క్రమంగా 10 నిమిషాలకు పెంచండి.
విపరీత కరణీ ఆసనం వల్ల ప్రయోజనాలు
- విపరీత కరణి ఆసనం సాధన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
- ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
- ఇది రెస్ట్‌లెగ్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- వాల్ పోజ్ లోబీపీ సమస్యను తగ్గిస్తుంది.
- కాళ్ల సిరలు ఉపశమనం పొందుతాయి.
- కాళ్ళ నొప్పులు, కండరాల తిమ్మిరి నుండి ఉపశమనం పొందుతుంది.
- జీర్ణక్రియ కూడా సాఫీగా ఉంటుంది.
- గాఢ నిద్రలో సహాయపడుతుంది.
- మెటబాలిక్ సిండ్రోమ్, మెనోపాజ్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.