Sugar syrup: వివిధ స్వీట్లకు తగ్గట్లు పంచదార పాకం ఎలా చేయాలి? కొలతలు, సూత్రాలు ఇవే-how to make sugar syrups for different types of sweets ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sugar Syrup: వివిధ స్వీట్లకు తగ్గట్లు పంచదార పాకం ఎలా చేయాలి? కొలతలు, సూత్రాలు ఇవే

Sugar syrup: వివిధ స్వీట్లకు తగ్గట్లు పంచదార పాకం ఎలా చేయాలి? కొలతలు, సూత్రాలు ఇవే

Koutik Pranaya Sree HT Telugu
Sep 23, 2024 10:30 AM IST

Sugar syrup: స్వీట్స్ కోసం వివిధ రకాలుగా పాకం కట్టాల్సి వస్తుంది. ఈ పంచదార పాకం ఏ స్వీట్స్ కోసం ఎలా కట్టాలి? కొలతలు, టిప్స్ ఏంటో చూసేయండి.

పాకం పట్టడానికి టిప్స్
పాకం పట్టడానికి టిప్స్

స్వీట్లు చేయాలంటే అన్నింటికీ దాదాపుగా పంచదార పాకం చేయడం తప్పనిసరి. అయితే ఈ పాకం పట్టడం చాలా మందికి సరిగ్గా రాదు. దాంతో స్వీట్స్ రుచి కూడా బాగుండదు. పంచదార నీళ్లు కలిపి చేసే చక్కెర పాకానికి స్వీట్ బట్టి కొలతలు, కొన్ని సూత్రాలుంటాయి. బెల్లం లేదా పంచదారతో వివిధ స్వీట్స్ కోసం ఎలా పాకం పట్టాలో చూడండి.

నీరు, చక్కెర నిష్పత్తి:

పాకం తయారు చేయడానికి పంచదార, నీటి సరైన నిష్పత్తిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన మోతాదులో చక్కెర, నీరు తీసుకోకపోతే సిరప్ సరిగ్గా రాదు. ఎప్పుడూ నీరు, చక్కెరను సమాన నిష్ఫత్తిలోనే తీసుకోవాలని గుర్తుంచుకోండి. వాటిని ఒకసారి కలిపి మరిగించి పాకం చేయాలి.

తీగ పాకం:

గులాబ్ జామూన్ కోసం అయితే తీగపాకం రావాలి. అంటే చేతి మధ్య పాకం పెట్టి సాగదీస్తే తీగ లాగా సాగాలి. అలా అయ్యాకే స్టవ్ కట్టేయాలి. లేదంటే గులాబ్ జామూన్లు సరిగ్గా రావు.

తేలికపాటి పాకం:

ఇక బూందీ లడ్డూ,మైసూర్ పాక్, కొబ్బరి బర్ఫీ లేదా కాజు కత్లీ వంటి స్వీట్లను తయారు చేయడానికి ఎక్కువగా పాకం కట్టాల్సిన అవసరం లేదు. అంటే పంచదార, నీటిని సమాన నిష్పత్తిలో తీసుకుని పంచదార పూర్తిగా కరిగేదాకా మరిగిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా పాకం ఉడికించక్కర్లేదు.

చిక్కీల కోసం:

పల్లీలు, నువ్వులు, జీడిపప్పు లాంటి వాటితో చిక్కీలు తయారు చేస్తారు. వీటి కోసం పట్టే పాకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటేమో పాకం కాస్త నీళ్లలో వేస్తే అది ఉండకట్టాలి. లేదంటే నీల్లలో చేతిని ముంచి పాకం కాస్త చేతి వేళ్ల మధ్య తీసుకుని సాగదీస్తే రెండు తీగలు కనిపించాి. దీనికోసం పంచదార పాకం కాస్త చిక్కగా అయ్యేలా నాలుగైదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.

ఇలా ఏ స్వీట్ కోసం ఎలాంటి పాకం పట్టాలో తెల్సుకుంటే ఏ తీపి వంటలైనా సులువుగా చేసేయొచ్చు.