Upma rava Gulab jamun: ఉప్మా రవ్వతో ఇలా హెల్తీగా గులాబ్ జామూన్ చేసేయండి, మైదా వాడాల్సిన అవసరం లేదు-gulab jamun with upma rava recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Upma Rava Gulab Jamun: ఉప్మా రవ్వతో ఇలా హెల్తీగా గులాబ్ జామూన్ చేసేయండి, మైదా వాడాల్సిన అవసరం లేదు

Upma rava Gulab jamun: ఉప్మా రవ్వతో ఇలా హెల్తీగా గులాబ్ జామూన్ చేసేయండి, మైదా వాడాల్సిన అవసరం లేదు

Haritha Chappa HT Telugu
Aug 27, 2024 05:30 PM IST

Upma rava Gulab jamun: గులాబ్ జామ్ చేయాలంటే మైదా పిండిని వాడే వారే ఎక్కువ. బయట దొరికే ఇన్‌స్టెంట్ గులాబ్ జామూన్ మిక్స్‌లో కూడా ఉండేది. మైదా కాకుండా ఇక్కడ మేము ఉప్మా రవ్వతో చేసే గులాబ్ జామ్ రెసిపీ ఇచ్చాము.

ఉప్మారవ్వతో చేసే గులాబ్ జామూన్ రెసిపీ
ఉప్మారవ్వతో చేసే గులాబ్ జామూన్ రెసిపీ (Pexels)

Upma rava Gulab jamun: మైదా వాడకూడదని ఎంత చెబుతున్నా కూడా కొన్ని రకాల స్వీట్లు ఆ పిండితోనే తయారవుతాయి. కాబట్టి మైదాను కొనే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గులాబ్ జామ్‌లకు తయారీకి మైదాయే ముఖ్యమైనది. బయట దొరికే ఇన్‌స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్‌ల్లో అధికంగా వాడేది మైదానే. మైదా వాడడం వల్ల అనేక రకాల రసాయనాలు శరీరంలో చేరుతాయి. కాబట్టి మీరు గులాబ్ జామ్ ప్రియులైతే... ఇక్కడ మేము ఉప్మా రవ్వతో గులాబ్ జామ్ ఎలా చేయాలో ఇచ్చాము. ఈ రెసిపీని ఫాలో అయిపోండి. దీనిలో మైదా వాడాల్సిన అవసరమే లేదు, ఇది చాలా రుచిగా ఉంటుంది.

గులాబ్ జామూన్ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉప్మా రవ్వ - రెండు కప్పులు

యాలకుల పొడి - ఒక స్పూను

పంచదార - రెండు కప్పులు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

నీరు - తగినంత

పాలు - రెండు కప్పులు

నెయ్యి - మూడు స్పూన్లు

ఉప్మా రవ్వతో గులాబ్ జామూన్ రెసిపీ

1. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి పంచదార, నీరు వేసి పాకం తీయండి.

2. అందులో ఒక స్పూను పాలు, అర స్పూను యాలకుల పొడి కూడా వేయండి.

3. చక్కెర సిరప్‌ను రెడీ చేసి పక్కన పెట్టుకోండి.

4. ఇప్పుడు మరొక కళాయి స్టవ్ మీద పెట్టి నెయ్యి వేయండి.

5. ఆ నెయ్యిలో ఉప్మా రవ్వను కాసేపు వేయించండి.

6. అది రంగు మారేవరకు వేయించి ఆ తరువాత కాచి చల్లార్చిన పాలను వేయండి.

7. అలాగే రెండు స్పూన్ల పంచదారను, అర స్పూను యాలకుల పొడిని కూడా వేయండి.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉంచి కలుపుతూ ఉండండి.

9. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి.

10. ఇది హల్వాలాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.

11. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చి చేత్తోనే చిన్న చిన్న బాల్స్‌లాగా చేసుకోవాలి.

12. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.

13. ఆ నూనెలో ఈ బాల్స్‌ని వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

14. తర్వాత ఆ బాల్స్ ని చక్కెర సిరప్‌లో వేసి ఒక గంట పాటు వదిలేయాలి.

15. చక్కెర సిరప్‌ను ఈ గులాబ్ జామూన్ మొత్తం పీల్చుకొని టేస్టీగా మారుతాయి. అప్పుడు తిని చూడండి ఇవి ఎంతో బాగుంటాయి. మైదాతో చేసిన గులాబ్ జామ్‌తో పోలిస్తే ఉప్మా రవ్వతో చేసిన గులాబ్ జామ్‌లే టేస్టీగా ఉంటాయి.

మైదా పిండితో చేసే ఆహారాలు ఏవీ ఆరోగ్యానికి మంచిది కాదు. మైదాను పూర్తిగా మానేయడమే ఉత్తమం. మైదాతో చేసిన ఆహార పదార్థాలను వేరే వాటితో చేసేందుకు ప్రయత్నించాలి. ఉదాహరణకు గులాబ్ జామున్‌ను మైదాతో మానేసి ఉప్మా రవ్వతో చేసినట్టు. మైదాలో ఎన్నో రసాయనాలను వాడతారు. దానికి ఆ తెలుపు రంగు వచ్చేందుకు బెంజీన్ ఎన్నో కలుపుతారు. మైదాతో చేసిన ఆహారాలు తినడం వల్ల డయాబెటిస్ బారిన త్వరగా పడే అవకాశం ఉంది. కాబట్టి గులాబ్ జామ్ తినాలనిపిస్తే ఇలా ఉప్మా రవ్వతో చేసుకోండి.

టాపిక్