Get Rid Of Lizard : వేసవిలో బల్లులను బయటకు తరిమేందుకు ఈజీ చిట్కాలు
Get Rid Of Lizard : వేసవిలో బల్లుల వంటి జీవుల బెడద పెరుగుతుంది. వేడి, వర్షాకాలంలో కీటకాల సమస్య కనిపిస్తుంది. అయితే బల్లులను వదిలించుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి.
వేసవి మెుదలైంది. ఈ స్థితిలో ఇళ్లల్లో బల్లుల బెడద క్రమంగా పెరుగుతోంది. బల్లులే కాదు.., వేసవి కాలంలో ఇంట్లో ఇతర జీవుల బెడద పెరుగుతుంది. వేడి, వర్షాకాలంలో ఏదైనా కీటకాల సమస్య ఉంటుంది. బల్లులను వదిలించుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి.
వంట గదిని శుభ్రం చేయండి
తడిగా ఉన్న ప్రదేశాలలో నివసించడానికి బల్లులు ఇష్టపడుతాయి. బల్లికి ఇష్టమైన ప్రదేశం వంటగది. ఎందుకంటే ఇక్కడ ఆయిల్, తేమ వాతావరణం ఉంటుంది. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది బల్లులను వంటగదికి దూరంగా ఉంచుతుంది. వంటగదిని క్లీన్‌గా ఉంచితే బల్లులు రాకుండా ఉంటాయి.
చలిని పెంచండి..
బల్లులు చలిని ఇష్టపడవు. మీరు ఇంట్లో ఏసీని కలిగి ఉంటే గది ఉష్ణోగ్రత 20-18 లేదా అంతకంటే తక్కువ మధ్య ఉంచవచ్చు. ఇది బల్లుల బెడదను తగ్గిస్తుంది. ఇంట్లో చలి ఉండేలా ప్లాన్ చేయండి.
నెమలి ఈకలు వాడండి
నెమలి ఈకల వాసనకు బల్లులు తట్టుకోలేవు. ఇవి ఇంట్లో ఉంచితే బల్లి ఇంట్లోంచి పారిపోతుంది. ఇది మంచి చిట్కా. బల్లుల బెడద తప్పించుకునేందుకు వీటిని ఉపయోగించండి.
గుడ్డు పెంకును ఉపయోగించండి
మీరు ప్రతి గది గోడపై ఒక గుడ్డుపెంకును తెరిచి ఉంచండి. దీనిని వేలాడదీస్తే, మీరు బల్లుల నుండి ఉపశమనం పొందుతారు. ఈ గుడ్ల దగ్గరకు వచ్చేందుకు బల్లులు ఇష్టపడవు.
నాఫ్తలిన్ వాసనతో చెక్
నాఫ్తలిన్ వాసనను బల్లులు తట్టుకోలేవు. బల్లులను వదిలించుకోవడానికి నాఫ్తలిన్ బాల్స్‌ను ఇంట్లో ఉంచుకోవచ్చు. మార్కెట్లో చాలా రకాల నాఫ్తలిన్ బాల్స్ దొరుకుతాయి. వాటిని మీరు ఇంట్లో ఉంచవచ్చు.
లెమన్ గ్రాస్ తో ఉపయోగం
లెమన్ గ్రాస్ వాసన ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. బల్లులకు దాని వాసన కూడా నచ్చదు. మీరు అలాంటి మూలికలు లేదా సువాసనలను ఇంట్లో ఉపయోగించవచ్చు. లెమన్ గ్రాస్ ఇంట్లో పెట్టుకోండి. బల్లులు దగ్గరకు రావు.
పెప్పర్ స్ప్రే
కాఫీ, పొగాకు పొడి వాసన బల్లులకు నచ్చదు. మీరు కాఫీ, పొగాకు పొడి బాల్స్‌ను తయారు చేసి ఇంటి చుట్టూ పెట్టుకోవచ్చు. పెప్పర్ గోడలపై స్ప్రే చేయవచ్చు. మిరియాలు, నీరు కలపడం ద్వారా ఇంట్లో స్ప్రే చేయండి. కొన్నిసార్లు గోడకు ఇది స్ప్రే చేయడం వలన సమస్య పరిష్కారం అవుతుంది
ఉల్లిపాయ, వెల్లుల్లితో ఉపయోగం
మీరు ఇంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన ఉపయోగిస్తే బల్లి పోతుంది. కొన్నిసార్లు మీరు వంటగదిలో తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లిని ఉంచవచ్చు. దని ద్వారా బల్లి సమస్యలను తొలగించుకోవచ్చు.
దీని గురించి ఆలోచించాలి
కొన్నిసార్లు మీరు ఇంట్లో పురుగుమందులను పిచికారీ చేయవచ్చు. అది బల్లులను దూరంగా ఉంచుతుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి, కుటుంబ సభ్యులకు చాలా హానికరం. పురుగుల మందు అస్సలు ఇంట్లో పిచికారీ చేయకూడదు. వృద్ధులు, చిన్నపిల్లలు దీని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తలతిరిగినట్టు అవుతుంది. మీరు పైన చెప్పిన విధంగా సహజంగా బల్లులను తొలగించేందుకు చిట్కాలు పాటించండి.