మీ ఇంట్లో బల్లులు ఉన్నాయా?.. అయితే తరిమేయండిలా..!-try these home remedies and shoo away the lizards ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ ఇంట్లో బల్లులు ఉన్నాయా?.. అయితే తరిమేయండిలా..!

మీ ఇంట్లో బల్లులు ఉన్నాయా?.. అయితే తరిమేయండిలా..!

HT Telugu Desk HT Telugu
Jun 09, 2022 03:06 PM IST

చాలా మంది ఇళ్లల్లో బల్లులను చూస్తుంటాం. వీటిని చూస్తే కొందరికి భయంగా అనిపిస్తే.. మరికొందరికి చికాకు తెప్పిస్తుంటాయి. బల్లుల్ని తరిమేయలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

<p>Lizards</p>
Lizards

చాలా మంది ఇంట్లో గోడలపై బల్లులు ఉండడం చూస్తుంటాం. ముఖ్యంగా వంటింట్లో, హాల్, దేవుడి గదిలో ఇలా ప్రతి చోట బల్లులు తిరుగుతూనే ఉంటాయి. అయితే వీటిని చూడటానికి చాలా చిరాగ్గా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి హాని అని కూడా చెబుతుంటారు.  మరీ వీటిని తరిమివేయడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాము.

రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్

ముందుగా ఎర్ర మిరప పొడి, నల్ల మిరియాల పొడిని సమాన పరిమాణంలో తీసుకోవాలి. వాటిని నీటిలో కలపండి, ఇంటి మూలల్లో, కిటికీలు, తలుపులు మొదలైన వాటిపై స్ప్రే/స్ప్లాష్ చేయండి. మిశ్రమం ఘాటైన వాసనకు బల్లులను దూరంగా పారిపోతాయి.

గుడ్డు పెంకు

బల్లులు గుడ్ల వాసనను అస్సలు ఇష్టపడవు. అందువల్ల, బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కొన్ని గుడ్డు పెంకులను ఉంచండి. దీంతో బల్లులు వాటంతట అవే పారిపోతాయి.

కాఫీ, పొగాకు

బల్లులను వదిలించుకోవడానికి కాఫీ పొడిని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం పొగాకు, కాఫీపొడి కలిపి ద్రావణాన్ని తయారు చేసి బల్లులు ఉండే ప్రదేశాల్లో పిచికారీ చేయాలి.

వెల్లుల్లి, ఉల్లిపాయ

వెల్లుల్లి మొగ్గలు, ఉల్లిపాయ ముక్కలను బల్లులు ఉండే ప్రదేశంలో ఉంచండి. వీటి వాసన వల్ల బల్లులను ఆ దరిదాపుల్లో కూడా ఉండవు . ఇది కాకుండా, మీరు ఉల్లిపాయ, వెల్లుల్లిని పేస్ట్ చేసి స్ప్రేగా కూడా ఉపయోగించవచ్చు.

కర్పూరం

బల్లులను తరిమికొట్టడంలో కర్పూరం కూడా ఉపయోగపడుతుంది. దీని కోసం ఇంట్లోని అన్ని మూలల్లో కర్పూరాన్ని ఉంచండి. కర్పూరం బల్లులను దూరం చేస్తుంది.

నెమలి ఈకలు

సాధరణంగా నెమళ్లు బల్లులను ఇష్టంగా తింటాయి. కాబట్టి బల్లులు వాటి నెమలి ఈకల వాసనను చూడగానే దూరంగా పారిపోతాయి. అయితే, కొంతమంది ఈ చిట్కా వల్ల ఉపయోగం లేదంటారు. బల్లి ప్రాణాలకు హాని కలిగించకుండా దూరంగా ఉంచాలనుకుంటే, మీరు ఈ ట్రిక్ని ప్రయత్నించవచ్చు.

నాఫ్తలీన్ బాల్స్

బల్లులను వదిలించుకోవడానికి 4 - 5 నాఫ్తలీన్ బాల్స్‌ను ఉపయోగించవచ్చు. వాటిని తీసుకుని ఇంటి మూలల్లో ఉంచడం ద్వారా వాటి వాసనకు అవి పారిపోతాయి.

బల్లులు ఇంట్లో తేమ, వెచ్చని ప్రదేశాలతో పాటు వెంటిలెటర్, కిచెన్ సింక్‌లు, అల్మారాలు మొదలైన ప్రదేశాలలో సులభంగా సంతానోత్పత్తి చేయగలవు. కాబట్టి, ఈ ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చూసుకోండి. వీటిని క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి.

 

Whats_app_banner