Honor X6 । అద్భుతమైన కెమెరా ఫీచర్లతో హానర్ నుంచి స్టైలిష్ ఫోన్!-honor x6 smartphone launched with good camera features check price ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Honor X6 । అద్భుతమైన కెమెరా ఫీచర్లతో హానర్ నుంచి స్టైలిష్ ఫోన్!

Honor X6 । అద్భుతమైన కెమెరా ఫీచర్లతో హానర్ నుంచి స్టైలిష్ ఫోన్!

HT Telugu Desk HT Telugu
Sep 21, 2022 11:11 PM IST

హానర్ నుంచి సరికొత్త Honor X6 స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఇందులో కెమెరా ఫీచర్లు బాగున్నాయి. ధర, ఇతర వివరలు చూడండి.

<p>Honor X6</p>
Honor X6

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ హానర్ వరుసగా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ స్పీడ్ పెంచింది. తాజాగా Honor X6 అనే కొత్త మిడ్-రేంజ్ ఫోన్‌ను నిశ్శబ్దంగా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెరుగైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, ఇది LED ఫ్లాష్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా X6 పోర్ట్రెయిట్ మోడ్, పనోరమా, టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ,1080p వీడియో రికార్డింగ్ వంటి ఫోటోగ్రఫీ ఫీచర్‌లను అందిస్తుంది. ఇంకా వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, హీలియో G-సిరీస్ చిప్‌సెట్, పెద్ద బ్యాటరీ వంటివి ముఖ్యాంశాలుగా ఉన్నాయి.

Honor X6 ఓషన్ బ్లూ, టైటానియం సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది. స్టోరేజ్, ర్యామ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే భద్రత కోసం, X6 ఫేస్ అన్‌లాక్, సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

ఇటువంటి మెరుగైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ సరసమైన ధరలోనే లభించనుంది. ఇంకా Honor X6లో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు అలాగే దీని ధరకు సంబంధించిన మొత్తం సమాచారం ఈ కింద చూడండి.

Honor X6 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • 4GB RAM, 64 GB/128 GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్
  • వెనకవైపు 50 MP + 2MP డ్యుఎల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్

కనెక్టివిటీ కోసం, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.1, GPS, NFC, USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్‌ ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఫోన్ సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. త్వరలోనే మిగతా మార్కెట్లలోకి రానుంది. అయితే ధర, లభ్యత వివరాలను వెల్లడించలేదు. సుమారు రూ, 15 వేల వరకు ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా.

ఇదిలా ఉంటే, భారతీయ మార్కెట్లో హానర్ కంపెనీ తమ కొత్త టాబ్లెట్ Honor Pad 8 ను లాంచ్ చేసింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం