Migraine Headache : మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం అందించే చిట్కాలివే..-here is the simple and effective and natural ways to reduce migraine headache ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Migraine Headache : మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం అందించే చిట్కాలివే..

Migraine Headache : మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం అందించే చిట్కాలివే..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 27, 2022 10:55 AM IST

Migraine Headache : ఎన్ని చికిత్సలు తీసుకున్న మైగ్రేన్ పూర్తిగా తగ్గదు అంటారు. పైగా ఇది వచ్చింది అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించడం మంచిది. అయితే కొన్ని చిట్కాలతో తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>మైగ్రేన్ నుంచి ఉపశమన చర్యలు</p>
మైగ్రేన్ నుంచి ఉపశమన చర్యలు

Migraine Headache : ప్రపంచవ్యాప్తంగా 7 మందిలో 1 మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారని ఇటీవల సర్వేలో తేలింది. మైగ్రేన్ తలనొప్పి, ముఖం లేదా ఎగువ మెడలో నొప్పిని కలిగిస్తుంది. ఫ్రీక్వెన్సీ, తీవ్రతలో మార్పులు కూడా ఉంటాయి. మైగ్రేన్ అనేది చాలా బాధాకరమైన ప్రాథమిక తలనొప్పి రుగ్మత. ఇది ఉన్నవారు వైద్య నిపుణులు సిఫార్సు చేసిన చికిత్స ప్రణాళిక కోసం న్యూరాలజిస్ట్‌ని సందర్శించడం ఉత్తమమైన చర్య. అయితే ఈ సమయంలో మీ అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడే కొన్ని మైగ్రేన్ హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో మీరు తెలుసుకుని ఫాలో అయిపోండి. మీకు తెలిసిన వారు ఇబ్బంది పడితే.. వారికి ఈ చిట్కాలు చెప్పి కాస్త రిలాక్స్ చేయండి.

1. నీరు

నిర్జలీకరణం (డీహైడ్రేషన్) కొంతమందిలో మైగ్రేన్‌లకు కారణం అవుతుంది. అందుకే రోజంతా తగినంత నీటిని తీసుకోవాలి. దీనివల్ల మైగ్రేన్ నొప్పి అదుపులోకి వస్తుంది.

2. మసాజ్

ఒత్తిడి, మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి మెడ, భుజాల కండరాలను మసాజ్ చేయవచ్చు. మసాజ్ చేయడం వల్ల మీరు రిలాక్స్ అవ్వవచ్చు.

3. ఆహారాలు

మైగ్రేన్ అంత సాధారణంగా అదుపులోకి రాదు. ఆ సమయంలో ప్రాసెస్ చేసిన ఫుడ్, పిక్లింగ్ ఫుడ్స్ మానుకోండి. త్వరగా జీర్ణమయ్యే ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మైగ్రేన్ సమస్య మరింత పెరిగే అవకాశముంది.

4. లావెండర్ నూనె

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ పీల్చడం వల్ల మైగ్రేన్ వల్ల కలిగే అసౌకర్యం తగ్గుతుంది. మీకు మైగ్రేన్ రాగానే.. వెంటనే లావెండర్ నూనె స్మెల్ తీసుకోవచ్చు. లేదా లావెండర్ ఫ్లేవర్ రూమ్ ఫ్రెషనర్స్ వాడవచ్చు.

5. యోగా

యోగా శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మైగ్రేన్ నొప్పికి యోగా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

Whats_app_banner