Relief From Migraine: ఈ చిట్కాలతో మైగ్రేన్​ను నయం చేయలేము కానీ.. ఉపశమనం పక్కా..-these natural remedies can relief you from migraine headache ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relief From Migraine: ఈ చిట్కాలతో మైగ్రేన్​ను నయం చేయలేము కానీ.. ఉపశమనం పక్కా..

Relief From Migraine: ఈ చిట్కాలతో మైగ్రేన్​ను నయం చేయలేము కానీ.. ఉపశమనం పక్కా..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 22, 2022 01:26 PM IST

Relief From Migraine: మైగ్రేన్ తలనొప్పిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇది తలలో ఒకవైపే భరించలేని నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా వికారం, అసౌకర్యానికి కూడా దారితీస్తుంది. పైగా మైగ్రేన్​తో బాధపడేవారు అధిక, సౌండ్​, ఘాటైన సువాసనల వల్ల ఇబ్బంది పడుతుంటారు. వీటి వల్ల తలనొప్పివచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే మైగ్రేన్​ తగ్గుతుందని చెప్పలేము కానీ.. కొన్ని చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>మైగ్రేన్ తలనొప్పికి ఇంటి చిట్కాలు</p>
మైగ్రేన్ తలనొప్పికి ఇంటి చిట్కాలు

Relief From Migraine: మీరు మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారైతే మీ బాధను మేము శాశ్వతంగా తగ్గించలేము. కానీ దాని నుంచి ఉపశమనం లభించే చిట్కాలను మాత్రం చెప్పగలం. మైగ్రేన్ నొప్పి వస్తే మనం మనలాగా ఉండలేము. నెమ్మదిగా పల్సేటింగ్ నొప్పిగా మొదలై.. క్రమంగా అభివృద్ధి చెంది.. భరించలేనిదిగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు వైద్య సహాయం తీసుకోవడం మంచిదే అయినప్పటికీ.. మీరు దానినుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సహజ నివారణులను అనుసరించవచ్చు. ఆ నొప్పినుంచి ఉపశమనం పొందవచ్చు.

స్ట్రెచ్‌లు సహాయపడతాయి

మైగ్రేన్‌లను నియంత్రించడంలో సహాయపడే కొన్ని స్ట్రెచ్‌లు బాగా ఉపయోగపడతాయి. కూర్చున్నప్పుడు లేదా నిల్చొని ఉన్నప్పుడు మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. అప్పుడు మీ ఎడమ చేతిని గాలిలో చాచి మీ మెడను మెల్లగా కుడివైపునకు వంచండి. 30 సెకన్ల పాటు ఉండి, వ్యతిరేక దిశలో అదే పునరావృతం చేయండి. ఇలా రెండు సార్లు చేయండి. దీనివల్ల మీకు కాస్త ఉపశమనం లభిస్తుంది.

బేబీ పోజ్

యోగాలో బేబీ పోజ్ చేస్తే మైగ్రేన్​నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనం ఎలా చేయాలంటే.. పిరుదులు మడమలను తాకే విధంగా మోకాళ్లపై కుర్చోవాలి. మీ వెన్నెముకను ముందుకు సాగదీస్తూ.. తలను నేలకు ఆనించాలి. చేతులు రెండూ ముందు చాచి ఉంచాలి.

జీవనశైలిలో మార్పులు

మైగ్రేన్‌కు నిద్రలేమి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. మంచి దినచర్యను అనుసరించడం అలవాటు చేసుకోండి. ప్రశాంతమైన చీకటి గదిలో పడుకోవడం ఇబ్బందిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు నిద్రపోలేకపోతే… ధ్యానం చేయండి. ఇది శారీరక నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఆఫీసులో పని చేస్తుంటే.. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోండి. దీని వల్ల మీ పని ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా.. తక్కువ పరిమాణంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి.

ఈ చిట్కాలు మైగ్రేన్ అటాక్ నుంచి మీకు ఉపశమనం అందిస్తాయి. ఈ దీర్ఘకాలిక రుగ్మతను నయం చేయలేనప్పటికీ.. దాని ఆగమనాన్ని నివారించడానికి మీరు చేయగలిగే మరికొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

వీటికి దూరంగా ఉండండి..

ఆల్కహాల్ లేదా కాఫీని తీసుకోవడం మానుకోండి. రెండూ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. ఇది మైగ్రేన్​ నొప్పిని తీవ్రతరం చేస్తుంది.

చాక్లెట్, చీజ్, పాల ఉత్పత్తులు వంటి డైటరీ ట్రిగ్గర్‌లకు కూడా దూరంగా ఉండాలి. మీ హార్మోన్లలో హెచ్చుతగ్గులు తలనొప్పికి దారితీస్తాయి కాబట్టి మీ హార్మోన్లను ట్రాక్ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం