Cabbage Fried Rice Recipe । ఆకుగోబితో ఫ్రైడ్ రైస్.. ఇది చాలా టేస్టీ రెసిపీ గురూ!
Cabbage Fried Rice Recipe: క్యాబేజీలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. క్యాబేజీ ఫ్రైడ్ రైస్ ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని చేయడం చాలా సులభం క్యాబేజీ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఇక్కడ చూడండి.
Quick Rice Recipes: అన్నంతో త్వరగా, రుచికరంగా ఏదైనా చేసుకోవడానికి మీకు క్యాబేజీ ఫ్రైడ్ రైస్ ఒక ఆప్షన్ గా ఉంటుంది. క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అనేది క్లాసిక్ చైనీస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. వేయించిన క్యాబేజీ, వెల్లుల్లి, మిరపకాయలు వేసి ఈ క్యాబేజీ రైస్‌ను చేసుకుంటే దీని రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మీరు ఎటువంటి సాస్‌లు ఉపయోగించకుండానే దీనిని తయారు చేసుకోవచ్చు,. మీరు గుడ్లు తినేవారైతే, మీరు వాటిని కూడా తయారీలో ఉపయోగించవచ్చు. క్యాబేజీ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఈ కింద ఇచ్చాము.
క్యాబేజీ లేదా ఆకు గోబిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలకు క్యాబేజీ ఒక స్టోర్‌హౌస్. ఇంకా విటమిన్ సి, థయమిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా దండిగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. క్యాబేజీ తినడం చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇప్పుడు క్యాబేజీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదివి తెలుసుకోండి.
Cabbage Fried Rice Recipe కోసం కావలసినవి
- 1½ కప్పు అన్నం
- 2 కప్పులు తరిగిన క్యాబేజీ
- 1/4 కప్పు పచ్చి బఠానీలు
- 2 పచ్చి మిరపకాయలు
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 2-3 వెల్లుల్లిని రెబ్బలు
- 1/2 టీస్పూన్ వెనిగర్
- 1/2 టీస్పూన్ కారం
- 2 టీస్పూన్ సోయా సాస్ (ఐచ్ఛికం)
- రుచికి తగినంత ఉప్పు
క్యాబేజీ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
- ముందుగా కడాయిలో నూనె పోసి, అధిక వేడితో వేడి చేయండి. నూనె వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, మిరపకాయలు వేసి వేయించాలి.
- తరువాత క్యాబేజీ తురుము, పచ్చి బఠానీలు కూడా వేసి అత్యధిక మంట మీద 2 నుండి 3 నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు కొద్దిగా వెనిగర్ వేయండి, క్యాబేజీ కొద్దిగా బంగారు రంగులోకి వచ్చే వరకు ఇంకా కరకరలాడే వరకు వేయించాలి.
- అనంతరం అన్నం, కారం, ఉప్పు, సోయా సాస్ వేసి బాగా కలపాలి, ఇలా మిక్స్ చేసి మరో 1 నుండి 2 నిమిషాలు వేయించాలి.
అంతే, క్యాబేజీ ఫ్రైడ్ రైస్ రెడీ. కొత్తిమీర చల్లుకోండి, నిమ్మకాయ ముక్కతో సర్వ్ చేసుకోండి.
సంబంధిత కథనం