Boiled Egg Fried Rice Recipe । బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్.. దీని రుచి ఎంతో ప్రత్యేకం!
Boiled Egg Fried Rice Recipe: రెగ్యులర్ వెర్షన్‌తో పోలిస్తే బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రత్యేకమైనది. ఉడకబెట్టిన గుడ్డు అన్నానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. రెసిపీని ఇక్కడ చూడండి.
Quick Rice Recipes: అన్నంతో త్వరగా ఏదైనా వండుకోవాలంటే ఫ్రైడ్ రైస్ ఒక మంచి ఆప్షన్ గా ఉంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, చేయడం కూడా చాలా సులభం. అయితే మీరు ఎప్పుడూ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే గిలకొట్టిన గుడ్లను ఫ్రై చేసి చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని ఉంటారు, కానీ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా తిన్నారా? రెగ్యులర్ వెర్షన్‌తో పోలిస్తే బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రత్యేకమైనది. ఉడకబెట్టిన గుడ్డు అన్నానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.
బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని తయారు చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. దీనిని కూడా అచ్చంగా రెగ్యులర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినట్లే చేస్తాము, అయితే ఇక్కడ ఉడికించిన గుడ్లు ఉపయోగిస్తాము. గుడ్డు ఫ్రై కంటే ఉడికించుకొని తినటమే ఆరోగ్యకరం అని మనందరికీ తెలుసు. ఈ వంటకం బిజీగా ఉన్న రోజుల్లో చేయడానికి సరైనది. బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Boiled Egg Fried Rice Recipe కోసం కావలసినవి
- బాస్మతి రైస్ - 3 కప్పులు (వండిన అన్నం)
- ఉడికించిన గుడ్లు - 4
- జీలకర్ర పొడి - 1 tsp
- ధనియాల పొడి - 1 tsp
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- అల్లం - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - 1
- కరివేపాకు - 1 రెమ్మ
- ఉల్లిపాయలు - 1
- క్యారెట్ ముక్కలు - 1 కప్పు
- ఉల్లికాడలు - ½ కప్పు
- కొత్తిమీర - ½ కప్పు
- నువ్వుల నూనె 1 టీస్పూన్
- ఉప్పు, కారం - రుచికి తగినంత
బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
- ముందుగా ఉడకబెట్టిన గుడ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టండి, అలాగే ఉల్లిపాయలు, ఉల్లికాడలు, క్యారెట్లను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
- మొదటగా ఒక వోక్‌లో నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
- ఆపైన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
- అనంతరం ఉడికించి చల్లార్చిన బాస్మతి అన్నం వేసి, బాగా కలపండి.
- ఇప్పుడు నువ్వుల నూనె కలపాలి, ఆపైన తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ప్రతిదీ బాగా కలపండి. ఈ దశలో ఉప్పును అవసరమైన విధంగా సర్దుబాటు చేసుకోండి
- చివరగా స్టవ్ ఆఫ్ చేసి, ఉడికించిన గుడ్లను అన్నంలో వేసి మృదువుగా కలపండి. ఫ్లేవర్ కోసం టొమాటో కెచప్‌ను కలుపుకోవచ్చు.
అంతే బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.
సంబంధిత కథనం
టాపిక్