health benefits of green peas: పచ్చి బఠానీల్లో పోషకాలతో బండెడు ఆరోగ్య ప్రయోజనాలు-here are the health benefits of green peas and its nutrition from expert dieticians ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Benefits Of Green Peas: పచ్చి బఠానీల్లో పోషకాలతో బండెడు ఆరోగ్య ప్రయోజనాలు

health benefits of green peas: పచ్చి బఠానీల్లో పోషకాలతో బండెడు ఆరోగ్య ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 11:31 AM IST

health benefits of green peas: పచ్చి బఠానీల్లో ఉండే పోషకాల కారణంగా వాటితో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్ని ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం..

Experts share health benefits of green peace: పచ్చి బఠానీలతో బండెడు ఆరోగ్య ప్రయోజనాలు
Experts share health benefits of green peace: పచ్చి బఠానీలతో బండెడు ఆరోగ్య ప్రయోజనాలు (Engin Akyurt)

పచ్చి బఠానీ (green peas) లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందని ఎక్కువ మందికి తెలుసు. అంతేకాదండి.. పచ్చి బఠాణిలో బండెడు పోషకాలు కూడా ఉన్నాయి. చిక్కుళ్ల జాతికి చెందిన ఈ పచ్చి బఠానీని హిందీలో మటర్ అని, ఇంగ్లీష్‌లో గ్రీన్ పీస్ అని అంటారు. శీతాకాలంలో ఈ పచ్చి బఠానీ ఎక్కువగా లభిస్తుంది. మిగిలిన కాలాల్లో అయిన ఫ్రోజెన్ బఠానీ లభ్యమవుతుంది. ఈ పచ్చి బఠానీని చాలా వంటకాల్లో వాడుకోవచ్చు. మీ ఆహారం రుచికరంగా మారడంతో పాటు పోషకాలు కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

న్యూట్రీషనిస్ట్ డాక్టర్ అర్చనా బాత్రా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. పచ్చి బఠానీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.

1. పచ్చి బఠానీలో ఫైబర్, ప్రొటీన్, ఐరన్ అధికం

పచ్చి బఠానీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పైగా ఇది మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్. ఐరన్ కూడా గణనీయమైన మోతాదులో లభిస్తుంది. ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి, శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా మెరుగవ్వడానికి తోడ్పడుతుంది.

2. పచ్చి బఠానీలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువ

పచ్చి బఠానీలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉంటుంది. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ పెద్దగా పెరగవు. వీటిల్లో ఉండే ఫైబర్, ప్రొటీన్ వల్ల మీకు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అంటే మీకు ఎక్కువ తిండి తినాల్సిన పని ఉండదు. తద్వారా కూడా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. పచ్చి బఠానీలో బీ విటమిన్లు, విటమిన్ సీ, మెగ్నీషియం తదితర విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లడ్ షుగర్ అదుపులో ఉంచేందుకు దోహదపడతాయి.

3. పచ్చి బఠానీతో జీర్ణ క్రియ సాఫీగా..

పచ్చి బఠానీతో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ ఫుడ్‌లో ఉండే బ్యాక్టీరియా మీ పేగు ఆరోగ్యానికి సహాయకారిగా ఉంటుంది. చెడు బ్యాక్టీరియాను పెరగనివ్వదు. ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్, ఇరిటేబుల్ బొవెల్ సిండ్రోమ్, పెద్ద పేగు క్యాన్సర్‌ నుంచి కోలుకునేందుకు తోడ్పడుతుంది.

4. పచ్చి బఠానీలో ఫోలేట్

ప్రెగ్నెన్సీ సమయంలో ఫోలెట్ ప్రాధాన్యత చాలా మందికి తెలిసొస్తుంది. ఆ సమయంలో తప్పనిసరిగా అవసరమయ్యే పోషకం ఇది. ఈ ఫొలేట్ పచ్చి బఠానీలో పుష్కలంగా ఉంటుంది. బేబీ మెదడు, వెన్నుపూస అభివృద్ధి చెందేందుకు ఈ ఫోలేట్ ఉపయోగపడుతుంది. ఇందుకోసమైతే రోజూ 400 మైక్రోగ్రాముల ఫోలేట్ అవసరం అవుతుంది.

5. ఇమ్యూనిటీకి పచ్చి బఠానీ

న్యూట్రసీ లైఫ్‌స్టైల్ సీఈవో, న్యూట్రీషనిస్ట్ డాక్టర్ రోహిణీ పాటిల్ పచ్చి బఠాణీతో ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ‘తాజా పచ్చి బఠాణీ చిక్కుళ్ల జాతికి చెందినది. వింటర్ సీజన్‌లో జలుబు, జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడతాం.. ఈ సమయంలో రోగనిరోధకత అవసరం. గ్రీన్ పీస్ మీ ఇమ్యూనిటీ పెంచుతుంది. ఎందుకంటే వీటిలో ఫ్లేవనాయిడ్లు, కెరొటెనాయిడ్లు, ఫెనోలిక్ యాసిడ్లు, పాలిఫెనోల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉన్న వారు వారి రోజువారీ డైట్‌లో పచ్చి బఠానీని తప్పక తీసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సీ, విటమిన్ ఇ, జింక్, కేట్‌చిన్, ఎపికేట్‌చిన్ వంటి పోషకాలు రోగనిరోధకతను పెంచుతాయి.

6. గుండె ఆరోగ్యానికి పచ్చి బఠానీ

విటమిన్ సీతో పాటు పచ్చి బఠానీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలు మీ గుండె ఆరోగ్యానికి ప్రయోజనకారిగా ఉంటాయని డాక్టర్ రోహిణీ పాటిల్ చెప్పారు. పచ్చి బఠానీలతో కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చని, ఇందులో కరిగే ఫైబర్ ఉండడమే అందుకు కారణమని వివరించారు. పచ్చి బఠానీలో ఉండే అధిక ఫైబర్ మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, మల బద్దకాన్ని నివారిస్తుందని చెప్పారు.

WhatsApp channel