UnHealthy Signs in Kids: మీ పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని చెప్పే ఐదు ముఖ్యమైన సంకేతాలు ఇవే, వీటిని నిర్లక్ష్యం చేయకండి-here are five important signs that your childs health is at risk dont ignore them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Unhealthy Signs In Kids: మీ పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని చెప్పే ఐదు ముఖ్యమైన సంకేతాలు ఇవే, వీటిని నిర్లక్ష్యం చేయకండి

UnHealthy Signs in Kids: మీ పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని చెప్పే ఐదు ముఖ్యమైన సంకేతాలు ఇవే, వీటిని నిర్లక్ష్యం చేయకండి

Haritha Chappa HT Telugu
Sep 02, 2024 02:00 PM IST

UnHealthy Signs in Kids: తల్లిదండ్రులు తమ కన్నా పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే పిల్లలు చూపించే కొన్ని రకాల లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఇక్కడ చెప్పే సంకేతాలు వారి ఆరోగ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించేవి.

పిల్లల్లో అనారోగ్యకర లక్షణాలు
పిల్లల్లో అనారోగ్యకర లక్షణాలు (Pexels)

UnHealthy Signs in Kids: తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉండాలనీ, సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. పిల్లలను ఎక్కువగా గమనించేది తల్లిదండ్రులే. ఎంత గమనించినా కూడా కొన్ని రకాల లక్షణాలను వారు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అలా చేస్తే మీ పిల్లలు ప్రమాదంలో పడినట్టే. మీ పిల్లల్లో ఇక్కడ చెప్పిన ఐదు లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ఇవి వారి ఆరోగ్యం ప్రమాదంలో పడిందని చెప్పే సంకేతాలు.

త్వరగా అలసిపోవడం

ఆడుకున్నప్పుడు లేదా శారీరక శ్రమ చేసినప్పుడు మీ పిల్లలు చాలా తక్కువ సమయానికి అలసిపోవడం, ఎగశ్వాస పీల్చుకోవడం వంటివి కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి. పిల్లలు ఎక్కువ సేపు ఆడగలరు. అసాధారణంగా అలసిపోవడం అనేది వారిలో కనిపించే ఒక అరుదైన లక్షణం. ఇది ఆస్తమా, హృదయ సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. రక్తహీనత, శ్వాసకోశ సమస్యల సంకేతంగా కూడా భావించవచ్చు. ఇది వారి శక్తి స్థాయిలను, శ్వాస విధానాలను సూచిస్తుంది. కాబట్టి పిల్లలు ఎంతసేపటికి అలసిపోతున్నారు? ఆడగలుస్తున్నారా? ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

హోమ్ ఫుడ్ ఇష్టపడకపోతే

సాధారణంగానే పిల్లలు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. బయటకొన్న ఆహారాలను ఇష్టంగా తింటారు. అలా అని ప్రతిరోజూ వాటిని తినరు. ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా తింటూ ఉంటారు. హోమ్ మేడ్ ఫుడ్‌ను తింటూనే బయట ఆహారాన్ని అడుగుతారు. అలా కాకుండా ఇంట్లో వండిన ఏ ఆహారాన్ని తినడానికి ఇష్టపడకుండా, కేవలం బయట నుంచి కొన్న ఫుడ్‌ను మాత్రమే తింటే అది వారి మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పోషకాహార లోపం వల్ల, జీర్ణ సమస్యలు, భావోద్వేగాల సమస్యల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల వారు ఇంటి ఆహారాన్ని ఇష్టపడరు. కాబట్టి వారి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా పడండి. ఇలా హోం ‌మేడ్ ఫుడ్‌ను తినకుండా పూర్తిగా బయట ఆహారాన్ని తింటున్నారంటే వారిపై మీరు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే.

నడుము కొలత పెరిగితే

సాధారణంగా పిల్లలు సన్నగా లేదా కాస్త బొద్దుగా ఉంటారు. సన్నగా ఉన్నా కూడా పైనుంచి కింద వరకు ఒకే పరిమాణాన్ని, ఆకారాన్ని కలిగి ఉంటారు. అలాగే బొద్దుగా ఉన్నవారు కూడా బుగ్గల నుంచి కింద పిరుదుల వరకు బొద్దుగా ఉండే శరీరాన్ని కలిగి ఉంటారు. అలా కాకుండా కేవలం నడుము దగ్గర, పిరుదుల దగ్గర లావు పెరిగి మిగతా శరీరం అంతా సన్నగా ఉంటే అది ఆరోగ్యానికి మంచి సంకేతం కాదు. ఇది రాబోయే కాలంలో వారు ఊబకాయం బారిన పడుతున్నారు అని చెప్పే లక్షణం. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులను కూడా సూచిస్తుంది. వారి ఎదుగుదలపై కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ పిల్లలు కేవలం నడుము భాగంలోనే అధికంగా లావుగా కనిపిస్తున్నట్లయితే జాగ్రత్త పడింది.

రాత్రిపూట నిద్ర పట్టకపోవడం

నిజానికి పిల్లలు శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. వారు ఉదయం నుంచి ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతారు. మధ్యాహ్నం పిల్లలు నిద్రపోవడానికి ఇష్టపడరు. కానీ రాత్రి మాత్రం వారికి చాలా త్వరగా నిద్ర కమ్మేస్తుంది. కానీ మీ పిల్లవాడు రాత్రిపూట ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్ర పోకుండా ఇబ్బంది పడుతున్నాడంటే అతనిలో ఏవో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అర్థం. పేలవమైన నిద్ర, మానసిక స్థితిని, మానసిక ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. తద్వారా వారి చదువు కూడా తగ్గిపోతుంది. కాబట్టి వారు నిద్ర విధానాలను గమనించండి. వారు నిద్రపోవడం, నిద్ర లేవడం ప్రశాంతంగా జరుగుతోందా? రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారా? లేదా అనేది గమనించండి. వారిలో పీడకలలు రావడం, తరచుగా మేల్కొంటూ ఉండడం వంటివి వారి ఆరోగ్యం ప్రమాదంలో ఉందని చెప్పే సంకేతాలు.

టాపిక్