Garlic Benefits- Side Effects । మగవారికి వెల్లుల్లి చాలా మంచిది, కానీ వారు తీసుకోకూడదు!
వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, అయితే మితంగా తిన్నప్పుడు మాత్రమే. వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు తెలుసుకోండి.
Garlic Usage Tips: భారతీయ వంటకాల్లో వెల్లులిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా పప్పులు, కూరలు, చట్నీలలో వెల్లుల్లి వేయడం వలన వాటి రుచి, సువాసన మరింత పెరుగుతుంది. వెల్లుల్లి కేవలం ఒక సుగంధద్రవ్యంగా మాత్రమే కాకుండా వివిధ ఔషధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లిని పరిమిత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిరూపితమైంది. అదే సమయంలో వెల్లుల్లిని అతిగా కూడా తినడం మంచిది కాదని చెబుతుంటారు. వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలి, వెల్లుల్లి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అతిగా తింటే కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Garlic Health Benefits- వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు
వెల్లుల్లిలో అల్లిన్, అల్లిసిన్, అజీ, అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్, డయల్‌ల్ ట్రైసల్ఫైడ్, ఎస్-అల్లిల్ మెర్‌కాప్టో సిస్టీన్ వంటి 33 రకాల సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి వివిధ మార్గాల్లో ప్రయోజనం చేకూరుస్తాయి. ఇదే కాకుండా, వెల్లుల్లి శరీరానికి అవసరమయ్యే 17 అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది. అదనంగా వెల్లుల్లిలో సెలీనియం, జెర్మేనియం, టెల్లూరియం వంటి మినరల్స్ ఉన్నాయి. ఇవి శరీర కణజాలాలను, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
వెల్లుల్లిలోని సమ్మేళనాలు DNA తయారీలో సహాయపడతాయి. శరీరం మంచి జీవక్రియను నిర్వహించడంలో సహాయపడతాయి. . వెల్లుల్లి లోని యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు తగ్గించి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
హృద్రోగులకు వెల్లుల్లి తినడం చాలా మేలు చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది రక్త నాళాలను శుభ్రపరచడానికి పని చేస్తుంది, కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తులకు విలువైన ప్రయోజనాలను అందిస్తుంది.
20 గ్రాముల వెల్లుల్లితో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటు తగ్గుతుంది. ఇది సిరలను శుభ్రపరచడమే కాకుండా చెడు కొవ్వు లిపిడ్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, ప్రతిరోజూ 1 వెల్లుల్లిని తీసుకోవడం సరిపోతుంది.
Garlic Side Effects - వెల్లుల్లి దుష్ప్రభావాలు
రోజూ 1-2 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, కానీ అంతకంటే ఎక్కువ తింతే నోటి దుర్వాసన, తీవ్రమైన చెమట వాసన, గుండెల్లో మంట, కడుపు సమస్యలు, రక్తస్రావం పెరగటం, ఇతర దుష్ప్రభావాలకు కారణం కావచ్చు.
వెల్లుల్లి దుష్ప్రభావాలు సాధారణంగా తేలికపాటివే ఉంటాయి. వెల్లుల్లి ఔషధ జీవక్రియపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు, అయితే ప్రతిస్కందకాలు (Anticoagulants/Blood Thinners) తీసుకునే రోగులు జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్సకు ఏడు నుండి 10 రోజుల ముందు వెల్లుల్లి తీసుకోవడం మానేయడం వివేకమైన చర్య. ఎందుకంటే వెల్లుల్లి రక్తస్రావం సమయాన్ని పొడిగిస్తుంది.
అందువల్ల ప్రతికూల ప్రభావాలను (adverse effects) నివారించటానికి వెల్లుల్లిని మితంగా తీసుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం