Happy Mothers Day : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. మదర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి-happy mothers day 2024 greetings quotes whatsapp status facebook messages mothers day wishes in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Mothers Day : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. మదర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Happy Mothers Day : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. మదర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Anand Sai HT Telugu
May 11, 2024 03:30 PM IST

Mothers Day Wishes In Telugu : ఈ సృష్టిలో తియ్యనైనది అమ్మ ప్రేమ. ఆమె లేనిదే జీవితం లేదు. ఆమె లేనిదే మనిషి మనుగడ లేదు. అలాంటి గొప్ప అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పండి. మీకోసం కొన్ని లైన్స్ ఇక్కడ ఉన్నాయి.

మదర్స్ డే శుభాకాంక్షలు
మదర్స్ డే శుభాకాంక్షలు (Unsplash)

Mothers Day 2024 Greetings : అమ్మ అంటేనే ప్రేమ, అమ్మ అంటేనే త్యాగం, అమ్మ అంటేనే దయ, అమ్మ అంటేనే నిలువెత్తు మంచితనం.. అమ్మ అంటేనే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే సైనికురాలు. అలాంటి అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె కడుపులో పుట్టినందుకు తనకు మంచి పేరు తీసుకువచ్చేలా బతకడం తప్ప.. మనం ఏమి చేయగలం. ఏం చేసినా అమ్మ మనపై చూపిన ప్రేమకు సరితూగలేం. అందుకే అమ్మ అంటే దైవం కంటే ఎక్కువ. కనిపించే స్త్రీ శక్తి అమ్మ.

మనకు ఎప్పుడూ గుర్తుండిపోయే తియ్యని జ్ఞాపకం అమ్మ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ అమ్మ గురించి ఎన్నోసార్లు ఆలోచిస్తాం. అయితే ఆమెకు ఈ మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలియజేయండి. మే 12న మదర్స్ డే.. ఈరోజున ఆమెకు మీ మనసులోని కొన్ని మాటలు చెప్పి అమ్మపై మీకు ఉన్న ప్రేమను తెలపండి. మనం ఎంత పెద్దవాళ్లమైనా అమ్మకు బిడ్డలమే.

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. నేను ఎంత ఎత్తుకు ఎదిగిన నీ ఒడిలో పసిబిడ్డనే అమ్మ.. హ్యాపీ మదర్స్ డే..

అమ్మ.. మాటల్లో చెప్పలేనంత ప్రేమ, 9 నెలల పాటు బిడ్డలను కడుపులో పెట్టుకుని సైనికుడిలా రక్షించుకున్నావ్.. నీ జీవితం నా కోసం త్యాగం చేశావ్.. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను.. మదర్స్ డే శుభాకాంక్షలు

నీ ప్రేమకు సాటి లేదు.. నా ముద్దుల తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు

ఈ లోకంలో కనిపించే దైవం అమ్మ.. నా దేవతకి నా వంతు శక్తి రావాలి.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు

కష్టాలన్నీ నీవే, సుఖాలన్నీ నావే.. అయినా ఏనాడు చిరాకు పడలేదు. మనల్ని అనుగ్రహించే దైవం అమ్మ.. అమ్మా.... నిన్ను అమ్మగా పొందడం నా అదృష్టం. Happy Mothers Day

మన జీవితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది అమ్మ... వారి రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ చాలదు.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు

ప్రేమలో ఆకాశం, సహనంలో భూమి.. సృష్టి ఇచ్చిన గొప్ప వరం అమ్మ... అమ్మా మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

అమ్మా... నీకు చాలా ప్రేమ, శ్రద్ధ మా గురించి.. నీ ఆలోచనలు మాపై ఎప్పుడూ ఇలానే ఉంటాయి. ఇంత ప్రేమ ఎలా సాధ్యం అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను.. అమ్మా...నువ్వు అద్భుతమైన శక్తివి.. Happy Mothers Day 2024

మీ అమ్మలో మాత్రమే మీరు స్వచ్ఛమైన ప్రేమను కనుగొనగలరు.. మదర్స్ డే శుభాకాంక్షలు

అమ్మ అంటే ఇంటి గుండె చప్పుడు, ఆమె లేకుండా హృదయం లేనట్లు అనిపిస్తుంది.. Happy Mothers Day

నువ్ ప్రపంచానికి ఒక వ్యక్తి కావచ్చు, కానీ నాకు నువ్వే ప్రపంచం.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మా..

తల్లిపై ఎలాంటి కోపం, ద్వేషం, మొండితనం చూపించినా నిన్ను మాత్రమే ప్రేమించే ఏకైక వ్యక్తి తల్లి.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు

కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి సాగించేది తల్లి.. Happy Mothers Day Amma

ప్రియమైన అమ్మా, నేను మీ నుండి పొందిన ప్రేమను వర్ణించడానికి పదాలు లేవు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా. మాతృదినోత్సవ శుభాకాంక్షలు

కలలు, కోరికలు, ఆశయాలు వదులుకుని కుటుంబాల కోసం బతికే తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

ప్రేమకు పూర్తి రూపం అమ్మ.. Happy Mothers Day 2024

Whats_app_banner