Pushpa Pushpa Song Lyrics: పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్ చూశారా? భూమి బద్ధలయ్యే పాట ఇది-pushpa 2 first single pushpa pushpa song lyrics are here allu arjun sukumar devi sri prasad magic mesmerized fans again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa Pushpa Song Lyrics: పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్ చూశారా? భూమి బద్ధలయ్యే పాట ఇది

Pushpa Pushpa Song Lyrics: పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్ చూశారా? భూమి బద్ధలయ్యే పాట ఇది

Hari Prasad S HT Telugu
May 07, 2024 09:27 AM IST

Pushpa Pushpa Song Lyrics: పుష్ప పుష్ప అంటూ సాగిపోయే పుష్ప 2 ది రూల్ మూవీ ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. మరి ఈ పాట లిరిక్స్ మీరు ఇంకా నేర్చుకున్నారా లేదా?

పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్ చూశారా? భూమి బద్ధలయ్యే పాట ఇది
పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్ చూశారా? భూమి బద్ధలయ్యే పాట ఇది

Pushpa Pushpa Song Lyrics: పుష్ప పేరు వింటనే ఇప్పుడు దేశమంతా ఊగిపోతోంది. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటైన పుష్ప 2 ది రూల్ మూవీ నుంచి ఈ మధ్యే పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఫస్ట్ సింగిల్ రిలీజైన సంగతి తెలుసు కదా. ఈ పాట ఇంకా యూట్యూబ్ లో దూసుకెళ్తూనే ఉంది. తెలుగులోనే 25 మిలియన్లకు పైగా ఈ పాట వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.

పుష్ప పుష్ప సాంగ్ ప్రభంజనం

పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ పాట మే 1న రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పటికీ యూట్యూబ్ మ్యూజిక్ లో నంబర్ వన్ ట్రెండింగ్ సాంగ్ గా ఈ పుష్ప పుష్ప కొనసాగుతోంది.

పుష్ప సాంగ్స్ తో దేశాన్ని దద్దరిల్లేలా చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడీ పాటతో భూమి బద్ధలయ్యేలా చేస్తున్నాడు. పుష్ప పుష్ప పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. మరి యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న ఆ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.

పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప

 

పుష్ప… పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్…

 

నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే

దేశం దద్దరిల్లే

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

 

నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే

భూమే బద్దలయ్యే

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

 

నువ్వు నిలవాలంటే ఆకాశం

ఎత్తే పెంచాలే

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

 

నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా

లోతే తవ్వాలే

పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

 

హే.. గువ్వపిట్ట లాగ వానకు తడిసి

బిక్కుమంటు రెక్కలు ముడిసి

వణుకుతు వుంటే నీదే తప్పవదా

 

పెద్ద గద్దలాగమబ్బులపైన

హద్దు దాటి ఎగిరావంటే

వర్షమైనా తలనే వంచి

కాళ్ళ కింద కురిసెయ్‍దా…

 

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్ (2 సార్లు)

 

ఎన్నో వచ్చిన పుష్పాకి

పాపం కొన్ని రావంటా

వణుకే రాదు, ఓటమి రాదు

వెనకడుగు, ఆగడము

అస్సలు రానే రాదు

 

అన్నీ ఉన్న పుష్పాకి

పాపం కొన్ని లేవంటా

భయమే లేదు, బెంగే లేదు

బెదురు ఎదురు తిరిగే లేదు

తగ్గేదే లేదు

 

ఎయ్, దండమెడితే దేవుడికే

సలాము కొడితే గురువులకే

కాళ్ళు మొక్కితే అమ్మకే రా

తల దించినావా బానిసవి

ఎత్తినావా బాద్‍షావి

తలపొగరే నీ కిరీటమైతే

భూతలమంతా నీదేరా

 

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్ (2 సార్లు)

 

ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే

బండరాయి కూడా బంగారు సింహాసనమంటా

వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా

ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే

తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే

ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే

 

హే, వాడు నీకు గొప్పే కాదు

వీడు నీకు ఎక్కువ కాదు

నీకు నువ్వే బాసులా ఉండు

హే, ఎవడో విలువ ఇచ్చేదేంది

ఎవడో నిను గుర్తించేదేంది

ఒంటి నిండా తిమ్మిరి ఉంటె

నీ పేరే నీ బ్రాండు

 

పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప రాజ్ (4 సార్లు)

 

అస్సలు తగ్గేదేలె..