Happy Easter : ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పేందుకు మీ కోసం కొన్ని లైన్స్-happy easter 2024 greetings best wishes whatsapp status facebook messages images easter wishes in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Happy Easter 2024 Greetings Best Wishes Whatsapp Status Facebook Messages Images Easter Wishes In Telugu

Happy Easter : ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పేందుకు మీ కోసం కొన్ని లైన్స్

Anand Sai HT Telugu
Mar 31, 2024 08:00 AM IST

Easter Wishes In Telugu : క్రైస్తవులకు అతిముఖ్యమైన పండుగలలో ఒకటి ఈస్టర్. ఈరోజున మీ ప్రియమైన వారికి కింది విధంగా శుభాకాంక్షలు చెప్పండి.

హ్యాపీ ఈస్టర్
హ్యాపీ ఈస్టర్ (Unsplash)

Happy Easter Sunday 2024 Wishes In Telugu : ఈస్టర్ ఆదివారం అనేది క్రైస్తవ మతంలో ముఖ్యమైన పండుగ. దీనిని యేసుక్రీస్తు పునరుత్థాన వేడుకగా జరుపుకుంటారు. ఏసుక్రిస్తు మరణాన్ని జయించి తిరిగి వచ్చేయడమే ఈస్టర్. ఈ పండుగను యేసుక్రీస్తు శిలువపై మరణించి తిరిగి వచ్చిన మూడో రోజున జరుపుకుంటారు. దీనిని క్రైస్తవ మతంలో ఈస్టర్ ఆదివారం అంటారు. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం నాడు జరుపుకుంటారు.

ఈస్టర్ ప్రాముఖ్యత ప్రకారం ఈ రోజున యేసుక్రీస్తు పునరుత్థానం అయ్యాడనే నమ్మకం ఉంది. అప్పటి నుండి ఈ రోజు క్రైస్తవ మతంలో ఆశ, జీవితం, విజయానికి చిహ్నంగా మారింది. యేసుక్రీస్తు పునరుత్థానానికి గుర్తుగా, ఆయన అద్భుత శక్తిని గౌరవించటానికి ఈస్టర్ ఆదివారం జరుపుకుంటారు.

ఈస్టర్ ఆదివారం నాడు, క్రైస్తవులు ప్రార్థన చేయడానికి చర్చికి వెళతారు. ఆధ్యాత్మిక సంగీతాన్ని వింటారు. మరణాన్ని జయించి యేసు క్రిస్తు మళ్లీ తిరిగి వచ్చిన వేడుకగా నిర్వహిస్తారు. పునరుత్థానం అంటే ఆయన మీ విశ్వాసం ఉన్న వారందరికీ చిరాయువు ప్రసాదించబడుతుందని నమ్మకం. యేసు దైవకుమారుడు, మరణానికి అతీతుడని క్రైస్తవులు నమ్ముతారు. ఈస్టర్ ఆదివారం పవిత్ర సందర్భంగా కొన్ని సందేశాలు, కోట్‌లను మీ ప్రియమైన వారికి షేర్ చేసి విషెస్ చెప్పండి.

ఈ రోజు సంతోషాన్ని కలిగిస్తుంది, ఇది ప్రేమను కలిగిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరికీ వేలకొలది దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎవరి మనసులోను దుఃఖం కలగకుండా ఉండనివ్వండి.ఈస్టర్ శుభాకాంక్షలు

సత్యాన్ని సమాధిలో పాతిపెట్టినా అది ఎక్కువ కాలం ఉండదని ఈస్టర్ చెబుతోంది. Happy Easter Day 2024

ఈస్టర్ రోజున యేసు ప్రభువు ఆశీస్సులు మీపై కురుస్తాయి. మీ జీవితంలో విజయం, సంతోషం, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను. Happy Easter

నేను ఈ ప్రదేశానికి నా సంతోషంతో యేసుతో కలిసి వచ్చాను. దేవా, నీ విగ్రహాన్ని చూసి నా హృదయానికి అపారమైన శాంతి లభించింది.. Happy Easter Sunday

ఓ ప్రభూ, నీవు మా వద్దకు తిరిగి వచ్చావు, నీ దర్శనం కోసం మేము ఆరాటపడ్డాం. మా ఆనందాలతో మా జీవితాలను నింపావు. మా అదృష్టాన్ని ప్రకాశవంతం చేశావ్, మా కలలను నెరవేర్చావు, Happy Easter 2024

యేసుక్రీస్తు పునరుత్థానం రోజున మీకు శాంతి, ప్రేమ, సంతోషం రావాలని కోరుకుంటున్నాము. ఈస్టర్ ఆదివారం శుభాకాంక్షలు

కష్ట సమయాల్లో, యేసుక్రీస్తు పునరుత్థాన అద్భుతం మీకు ఆశ, బలాన్ని ఇస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈస్టర్ శుభాకాంక్షలు 2024

ఈస్టర్ అంటే జీవితానికి పునర్జన్మ, ప్రేమ, విశ్వాసం, ఆశలు. ఇది యేసుపై మన విశ్వాసాన్ని పెంచుతుంది. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు

సంతోషాలు చాలా ఉన్నాయి.. కానీ సమస్యలు కూడా చాలానే ఉన్నాయి.. జీవితంలో చాలా లాభాలు ఉన్నాయి.. కానీ చాలా నష్టాలు కూడా ఉన్నాయి. భగవంతుడు మనకు కొంచెం దుఃఖం ఇచ్చాడంటే, మనకు చాలా దీవెనలు కూడా ఇచ్చాడు.. ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు

WhatsApp channel