Premalu OTT Release Date: ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్‌పై యూట‌ర్న్ - మ‌రింత ఆల‌స్యం కానున్న స్ట్రీమింగ్‌!-malayalam movie premalu ott streaming delayed netizens troll on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Premalu Ott Release Date: ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్‌పై యూట‌ర్న్ - మ‌రింత ఆల‌స్యం కానున్న స్ట్రీమింగ్‌!

Premalu OTT Release Date: ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్‌పై యూట‌ర్న్ - మ‌రింత ఆల‌స్యం కానున్న స్ట్రీమింగ్‌!

Nelki Naresh Kumar HT Telugu
Mar 29, 2024 11:58 AM IST

Premalu OTT Release Date: ప్రేమ‌లు మూవీ శుక్ర‌వారం (మార్చి 29న‌) ఓటీటీలో రిలీజ్ కాక‌పోవ‌డంతో ఆడియెన్స్ డిస‌పాయింట్ అయ్యారు. ఈ ల‌వ్‌స్టోరీ ఓటీటీ రిలీజ్ మ‌రో రెండు వారాలు ఆల‌స్యం కానున్న‌ట్లు తెలుస్తోంది. అందుకు కార‌ణం ఏమిటంటే?

ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ డేట్‌
ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ డేట్‌

Premalu OTT Release Date: ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడ‌న్న‌ది సినీ అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. మార్చి 29న (శుక్ర‌వారం) డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. తెలుగు, మ‌ల‌యాళంతో పాటు మిగిలిన భాష‌ల్లో రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ మూవీ మాత్రం ఓటీటీలో రిలీజ్ కాక‌పోవ‌డంతో ఆడియెన్స్ డిస‌పాయింట్ అయ్యారు. ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అంటూ డిస్నీ హాట్‌స్టార్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

కార‌ణం ఇదేనా...

ప్రేమ‌లు త‌మిళ వెర్ష‌న్ మార్చి 15న థియేట‌ర్ల‌లో రిలీజైంది. తెలుగు వెర్ష‌న్ మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తెలుగు, త‌మిళ వెర్ష‌న్స్ థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌టమే ఓటీటీ రిలీజ్ ఆల‌స్యానికి కార‌ణం కావ‌చ్చున‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌ల‌యాళంలో రిలీజై న‌ల‌భై రోజులు దాటిన థియేట‌ర్ల‌లో భారీగా ఈ మూవీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

నిర్మాత‌ల రిక్వెస్ట్‌తో మార్చి 29న కాకుండా మ‌రో రెండు వారాలు ఆల‌స్యంగా ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని డిస్నీ హాట్‌స్టార్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఏప్రిల్ సెకండ్ వీక్‌లో ప్రేమ‌లు మూవీ ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. ఏప్రిల్ 12న ఈ ల‌వ్‌స్టోరీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లోనే ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్న‌ట్లు తెలుస్తోంది.

తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్‌...

ప్రేమ‌లు తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో ప‌దిహేను కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం డ‌బ్బింగ్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రేమ‌లు సినిమాను తెలుగులో అగ్ర‌ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. ఈ సినిమాతోనే డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ‌ ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను ద‌క్కించుకున్నాడు.

మూడు కోట్ల బ‌డ్జెట్‌...130 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ప్రేమ‌లు సినిమాను మ‌ల‌యాళంలో స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ త‌న స్నేహితుల‌తో క‌లిసి నిర్మించాడు. మూడు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ది. మంజుమ్మెల్ బాయ్స్ త‌ర్వాత ఈ ఏడాది మ‌ల‌యాళంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన రెండో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో...

ప్రేమ‌లు సినిమాలో న‌స్లేన్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించారు. హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ర్శ‌కుడు గిరీష్ ఏడీ ఈ మూవీ మ‌ల‌యాళం మూవీని రూపొందించాడు. హైద‌రాబాద్‌లో గేట్ కోచింగ్ తీసుకోవ‌డానికి వ‌స్తాడు స‌చిన్‌. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే రీనూతో ప్రేమ‌లో ప‌డ‌తాడు.

రీనూను ఆమె కోలిగ్ ఆది కూడా ఇష్ట‌ప‌డుతుంటాడు. స‌చిన్‌, ఆదిల‌లో రీనూ ఎవ‌రిని ప్రేమించింది? స‌చిన్ బ్రేక‌ప్ ల‌వ్‌స్టోరీల‌కు ఎండ్ ప‌డిందా? లేదా అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఈ సినిమాలో త‌న క్యూట్ యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌ది మ‌మితా బైజు. ప్రేమ‌లుతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది. ప్రేమ‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో మ‌మితా బైజుకు తెలుగు, త‌మిళ భాష‌ల నుంచి ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి