2018 Telugu Tv Premiere: టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన 2018 తెలుగు వెర్షన్ - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుందంటే?
2018 Telugu Tv Premiere: ఈ ఏడాది మలయాళంతో పాటు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 2018 మూవీ టీవీలోకి రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ ప్రీమియర్ స్టార్ మా ఛానెల్‌లో టెలికాస్ట్ కానుంది.
2018 Telugu Tv Premiere: ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియన్ లెవెల్‌లో పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో 2018 ఒకటి. మే 5న మలయాళంలో రిలీజైన ఈ మూవీ 210 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.

తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది.సెప్టెంబర్ 10న ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి స్టార్ మా ఛానెల్‌లో 2018 మూవీ టెలికాస్ట్ కానుంది. ఈ సినిమాను తెలుగులో జీఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత బన్నీవాస్ రిలీజ్ చేశారు. 2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు వణికించిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కింది.
ఇడుక్కి అనే డ్యామ్ తెగిపోవడంతో దగ్గరలోని ఇళ్లన్ని మునిగిపోతాయి. ఈ వరదల కారణంగా కొంత మంది జీవితాలు ఎలా అతలాకుతలం అయ్యాయి.
ఆర్మీలో ఉద్యోగం మానేసిన అనూప్ (టోవినో థామస్), వాతావరణ శాఖలో పనిచేసే ఉద్యోగి (కుంచకోబోబన్), దుబాయ్ నుంచి అమ్మను చూడటానికి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (వినీత్ శ్రీనివాసన్)తో పాటు మరికొందరికి వరదల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అన్నది దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ 2018 సినిమాలో హార్ట్ టచింగ్‌గా ఆవిష్కరించారు.
కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు ఐదింతల లాభాల్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్, కుంచకోబోబన్‌తో పాటు ఆసిఫ్ అలీ, నరేన్, అపర్ణ బాలమురళి కీలక పాత్రలను పోషించారు. సోని లివ్ ద్వారా ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.