Groundnut Oil: వేరుశెనగనూనె గురించి ఈ నిజాలు తెలిస్తే.. ఈరోజు నుంచే దాన్ని వాడడం మొదలు పెడతారు
Groundnut Oil: వేరుశెనగ నూనెతో వండిన వంటలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ ఇప్పుడు ఎక్కువగా అందరూ సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివే వినియోగిస్తున్నారు. వేరుశనగ నూనె వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Groundnut Oil: కరోనా వచ్చి పోయాక ఆరోగ్య స్పృహ పెరిగింది. తినే ఆహారంపై కూడా ఆ ప్రభావం పడింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇంట్లో వాడే నూనె మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. పూర్వం అధికంగా వేరుశనగ నూనెను వినియోగించేవారు. ఇప్పుడు సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి రావడంతో వేరుశనగ నూనెను వాడే వారి సంఖ్య తక్కువగా ఉంది. వేరుశనగ నూనెను వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే... మీరు ఈరోజు నుంచే ఆ నూనెను వినియోగించడం మొదలుపెడతారు.
వేరుశనగ నూనెలో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. లినోలెయిక్ యాసిడ్, ఒలేయిక్ యాసిడ్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఈ రెండూ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండెల్లో మంట వంటివి రాకుండా అడ్డుకుంటాయి. ఈ నూనెలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పోషకాలు ఎక్కువ, కాబట్టి శరీర కణాలను రక్షించి ఆక్సికరణ నష్టం జరగకుండా ఇది చూసుకుంటుంది. చర్మ ఆరోగ్యానికి, నరాల పనితీరుకు, కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి వేరుశనగ నూనె చాలా అవసరం.
మిగతా నూనెలతో పోలిస్తే
వేరుశెనగ నూనెను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినా కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించదు. కానీ కొన్ని రకాల నూనెలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే... ఆ నూనెలో క్యాన్సర్ కారకాలు జనించే అవకాశం ఉంది. కానీ వేరుశనగ నూనెను మీరు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచినా కూడా అందులో హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి కావు. కాబట్టి డీప్ ఫ్రై వంటకాలు చేసేటప్పుడు వేరుశనగ నూనెను వినియోగించడం చాలా మంచిది.
గుండె ఆరోగ్యానికి వేరుశనగ నూనె ఎంతో మేలు చేస్తుంది. దీనిలో సంతృప్తి కొవ్వులు చాలా మితంగా ఉంటాయి. అలాగే కొవ్వు ఆమ్లాల సమతుల్యంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి అవసరమైన మంచి కొవ్వులు దీనిలో ఉంటాయి. కాబట్టి గుండె కోసమైనా వేరుశనగ నూనెను తినడం అలవాటు చేసుకోండి.
దీన్ని వాడడం వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ నుండి ఇది మనల్ని కాపాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని కాంతివంతం చేసి జుట్టు బలంగా ఎదిగేలా చేస్తుంది.
బరువు తగ్గాలి అనుకునేవారు వేరుశనగ నూనెతో వండిన ఆహారాలను తినేందుకు ప్రయత్నించండి. దీనిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను ఇది పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి మీరు బరువు పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే మనం చక్కగా పనులు చేసుకోగలం. వేరుశనగ నూనెతో వండిన వంటకాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు రావు. అలాగే శరీరం పోషకాలను సక్రమంగా శోషించుకుంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
వేరుశనగ నూనెను సహజ మాయిశ్చరైజర్ గా కూడా వినియోగించుకోవచ్చు. అప్పుడప్పుడు శరీరానికి, తలకు పట్టించి మసాజ్ చేస్తే మంచిది.
టాపిక్