Egg khichdi: బరువు తగ్గేందుకు కోడిగుడ్డు కిచిడి, రెసిపీ అదిరిపోతుంది-egg khichdi recipe in telugu know how to make egg recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Khichdi: బరువు తగ్గేందుకు కోడిగుడ్డు కిచిడి, రెసిపీ అదిరిపోతుంది

Egg khichdi: బరువు తగ్గేందుకు కోడిగుడ్డు కిచిడి, రెసిపీ అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Feb 16, 2024 12:00 PM IST

Egg khichdi: కోడి గుడ్డుతో చేసిన రెసిపీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి కోడిగుడ్డు కిచిడీని ట్రై చేయండి. ఇది పెసరపప్పు కిచిడీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా సులువు.

కోడిగుడ్డు కిచిడీ రెసిపీ
కోడిగుడ్డు కిచిడీ రెసిపీ

Egg khichdi: ఆహారంలో కోడి గుడ్డుతో చేసిన వంటకాలు తినమని చెబుతూ ఉంటారు పోషకాహార నిపుణులు. కోడిగుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. దాన్ని బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. కిచిడి అందరూ ఇంట్లో చేసుకునేదే. ఎక్కువగా పెసరపప్పు, కందిపప్పు, బియ్యం కలిపి ఈ కిచిడీలు చేసుకుంటారు. ఒకసారి కోడిగుడ్డుతో కిచిడీ ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పొట్ట నిండుగా అనిపిస్తుంది. కనుక ఎక్కువగా కూడా తినలేరు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ కోడి గుడ్డు కిచిడి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు.

yearly horoscope entry point

కోడిగుడ్డు కిచిడి రెసిపీకి కావలసిన పదార్థాలు

కోడి గుడ్లు - మూడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

టమోటోలు - రెండు

ఉల్లిపాయ - ఒకటి

గరం మసాలా - ఒక స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చిమిర్చి - రెండు

వండిన కిచిడి - రెండు కప్పులు

కోడిగుడ్డు కిచిడి రెసిపీ

1. పెసరపప్పుతో లేదా కందిపప్పుతో కిచిడీని చేసుకుంటూ ఉంటారు.

2. ముందుగా మీకు నచ్చినట్టు కిచిడీ వండేసుకోండి. వండుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి.

3. ఇప్పుడు కోడిగుడ్డుతో కిచిడీ చేయడానికి సిద్ధం అవ్వండి.

4. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

5. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి వేయించండి.

6. అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేయండి.

7. ఇవి పచ్చివాసన పోయేదాకా వేయించండి.

8. ఇప్పుడు టమోటా తరుగును వేసి ఉప్పు వేసి మూత పెట్టండి.

9. అందులో కారం, గరం మసాలా వేసి బాగా కలపండి.

10. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి.

11. కిచిడీలో కూడా ఉప్పు వేసి ఉంటారు గనక మరీ ఎక్కువ కాకుండా తక్కువగా వేసుకోండి.

12. ఇప్పుడు ఈ మిశ్రమంలో మూడు కోడిగుడ్లను పగలగొట్టి బాగా కలపండి.

13. ఇది కోడి గుడ్డు పొరటులాగా అవుతుంది.

14. ఇందులో ముందుగా వండి పెట్టుకున్న కిచిడిని వేసి బాగా కలుపుకోండి.

15. పైన కొత్తిమీర తరుగును చల్లుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

16. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగపడుతుంది.

17. అల్పాహారంగా దీన్ని తింటే రోజంతా మీకు శక్తి అందుతూనే ఉంటుంది.

అల్పాహారంలో కోడి గుడ్డు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కోడిగుడ్లలో మనకు అవసరమైన పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కండరాలను బలంగా మార్చేందుకు ఉపయోగపడతాయి. రోజంతా మనకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. కిచిడీలో పెసరపప్పు ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కోడిగుడ్డులో ఉన్న ఐరన్‌ను శరీరం త్వరగా శోషించుకోగలదు. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులు కోడి గుడ్డును ప్రతిరోజూ తినడం అవసరం. అది కూడా ఉడకబెట్టిన కోడి గుడ్డును తింటే మరీ మంచిది. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలన్న కూడా ప్రతిరోజూ కోడిగుడ్డును తింటే ఉత్తమం. జుట్టు, చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలంటే ప్రతిరోజు కోడిగుడ్డును తినాలి. దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి. నరాల బలహీనత ఉన్నవారు కోడి గుడ్డుతో చేసిన ఆహారాలను అధికంగా తినడం అలవాటు చేసుకోవాలి. ఒకసారి ఈ కోడి గుడ్డు కిచిడీని ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా పొట్ట నిండుతుంది.

Whats_app_banner