Airfryer: ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉందా? దాంతో చేయగలిగే ఏడు పనులు ఇవిగో-got an air fryer at home here are seven things you can do with it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Airfryer: ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉందా? దాంతో చేయగలిగే ఏడు పనులు ఇవిగో

Airfryer: ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉందా? దాంతో చేయగలిగే ఏడు పనులు ఇవిగో

Haritha Chappa HT Telugu
Feb 25, 2024 11:00 AM IST

Airfryer: ఇప్పుడు ఎయిర్ ఫయర్ ఎక్కువమంది ఇళ్లల్లో కనిపిస్తోంది కానీ దాన్ని సమర్థంగా వాడే వారి సంఖ్య తక్కువే ఎయిర్ తో చేయగల పనులు జాబితా ఇక్కడ ఇచ్చాము

ఎయిర్ ఫ్రైయర్ లో ఏం వండాలి?
ఎయిర్ ఫ్రైయర్ లో ఏం వండాలి? (Getty images)

Airfryer: ఎయిర్ ఫ్రైయర్ ఉంటే వంట త్వరగా అవుతుంది. కొన్ని రకాల స్నాక్స్ ను సులువుగా తయారు చేసుకోవచ్చు. అలాగే క్రిస్పీ స్నాక్స్ ఎయిర్ ఫ్రైయర్లో సులువుగా అవుతాయి. ముఖ్యంగా దీనిలో నూనె అవసరం లేదు, కాబట్టి ఎక్కువ మంది ఎయిర్ ఫ్రైయర్ వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎయిర్ ఫ్రైయర్లో ఎలాంటి వంటలు వండవచ్చో ఎంతోమందికి తెలియదు. ఎయిర్ ఫ్రైయర్‌తో చేయగల ఏడు పనులు ఏమిటో మేమిక్కడ చెబుతున్నాము. ఇవి మీ వంట గదిలో ప్రయత్నించండి.

1. ఎయిర్ ఫ్రైయర్లో కూరగాయలను క్రిస్పీగా వేయించుకోవచ్చు. కాస్త ఆలివ్ ఆయిల్, మసాల చల్లి కూరగాయలను వేయించి చూడండి. అవి ఆరోగ్యకరం కూడా స్నాక్స్ గా ఉపయోగపడతాయి.

2. కేవలం వేయించడమే కాదు బేకింగ్ కూడా ఎయిర్ ఫ్రైయర్లో చేయొచ్చు. కుకీల నుండి కప్ కేక్స్ వరకు మీరు దానిలో ఉండవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి.

3. చికెన్ వింగ్స్ అంటే ఎంతో మందికి ఇష్టం. దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో టేస్టీగా వండుకోవచ్చు. అధిక నూనె అవసరం లేదు. జ్యూసీగా వస్తుంది. మెత్తగా ఉంటుంది. తినాలనిపించేలా ఉంటుంది. కాబట్టి ఒకసారి చికెన్ వింగ్స్ ను ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయండి.

4. ఎర్రని బొగ్గులపై ఎంతోమంది చికెన్, మటన్ వంటివి కాలుస్తూ ఉంటారు. అదే బార్బెక్యూ. వీటిని ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేయొచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. జ్యూసీగా వస్తాయి. పైగా నల్లగా మాడవు, కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలే చేస్తాయి.

5. శాకాహారులకు పనీర్ వంటకాలు అంటే ఇష్టంగా ఉంటుంది. పనీర్ పై కాస్త ఉప్పు, పసుపు, కారం మసాలాలలో కలిపి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి క్రిస్పీగా వేయించండి. పైన కాస్త కొత్తిమీరను జల్లుకొని తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మీరే పదే పదే చేసుకుని తింటారు.

6. ఎయిర్ ఫ్రైయర్లో డ్రై ఫ్రూట్స్ ను సులువుగా చేసుకోవచ్చు. బెర్రీలు, కివి వంటివి సన్నగా కోసుకొని ఎయిర్ ప్రైయర్లో బీహైడ్రేట్ చేయండి. కాసేపట్లో మీకు టేస్టీ అండ్ హెల్దీ డ్రైఫ్రూట్స్ రెడీ అయిపోతాయి. బయటకు వీటి ధర అధికంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకొని తినండి.

7. మిగిలిపోయిన ఫ్రైడ్ చికెన్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి మళ్లీ తాజాగా కావాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో ఒకసారి పెట్టి తీయండి. అవి క్రంచీగా మారుతాయి.

టాపిక్