Sleepy In Summer । వేసవిలో పగటిపూట నిద్ర ఆవహిస్తోందా? చురుకుగా ఉండటానికి చిట్కాలు ఇవిగో!-feeling sleepy in summer here are the tips to be active ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleepy In Summer । వేసవిలో పగటిపూట నిద్ర ఆవహిస్తోందా? చురుకుగా ఉండటానికి చిట్కాలు ఇవిగో!

Sleepy In Summer । వేసవిలో పగటిపూట నిద్ర ఆవహిస్తోందా? చురుకుగా ఉండటానికి చిట్కాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu
Apr 18, 2023 03:06 PM IST

Feeling Sleepy In Summer: ఈ వేసవిలో రోజూ మగతగా, అలసటగా ఉంటుందా? అయితే మీ నిద్రమబ్బు పోవటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి.

Feeling Sleepy In Summer
Feeling Sleepy In Summer (Unsplash)

Summer Health Tips: మీరెప్పుడైనా ఆలోచించారా, వేసవిలో కొన్నిసార్లు చాలా నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. రోజంతా మగతగా (Fatigue) ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు. ముఖ్యంగా పనిచేసేటపుడు ఈ మగత మన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది, ఉత్పాదకతను తగ్గిస్తుంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. నిజానికి మనం నిద్రపోవడానికి మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ (Melatonin) ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనిని మనం సూర్యకాంతి (Sun Light) నుంచి సహజంగా పొందుతాం. ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది, మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అదనంగా ఎండవేడికి మన శరీరంలో నీరు, లవణాలను కోల్పోతాం. ఫలితంగా మనలోని శక్తి క్షీణిస్తుంది, అలసటగా అనిపిస్తుంది. ఈ కారకాలన్నీ కలిసి నిద్రమత్తును కలిగిస్తాయి.

Tips To Avoid Feeling Sleepy In Summer

ఈ వేసవిలో నిద్రమత్తు నుంచి బయటపడాలంటే ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలను అందించారు, అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Limit Sun Exposure- ఎండకు గురికాకండి

ఎండలో ఎక్కువ సేపు ఉన్నప్పుడు మెలకువగా ఉండడం చాలా కష్టం, ఎందుకంటే వేడి మనలోని బ్యాటరీలను హరించివేస్తుంది. సూర్యరశ్మికి గురికావడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, ఇది బద్ధకం, అలసటను పెంచుతుంది, మీకు నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఎండకు గురికాకండి.

Follow Sleep Routine- నిద్ర దినచర్యను అనుసరించండి

మీకు నిద్ర సమస్యలు ఉన్నట్లయితే, మీరు ప్రతీరోజు రాత్రి నిర్ణీత సమయానికి నిద్రపోవడం, నిర్ణీత సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. వారాంతాల్లో ఇదే అలవాటును అలవర్చుకోండి, రాత్రి తగినంత నిద్రపోతే రోజంతా చురుకుగా ఉంటారు.

Stay Hydrated- హైడ్రేటెడ్‌గా ఉండండి

అలసటగా అనిపించడం వేసవి కాలంలో కలిగే డీహైడ్రేషన్ సాధారణ సంకేతం. మీరు అలసటగా, బలహీనంగా ఉండటం వలన నిద్రలోకి జారుకునేలా చేస్తుందు. కాబట్టి, నిర్జలీకరణం చెందకుండా ఉండటానికి, తగినంత నీరు త్రాగండి. రిఫ్రెష్‌గా ఉండటానికి, త్రాగునీటితో పాటు, , తాజా పండ్లు పండ్లరసాలు తీసుకోండి. మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలను త్రాగండి. ఇవి బద్ధకాన్ని పోగొడతాయి, అలసటను తరిమేస్తాయి. వేసవిలో తక్కువ చక్కెర, ఎక్కువ ఎలక్ట్రోలైట్‌లు ఉన్న పానీయాలు తాగండి. కెఫీన్, ఆల్కాహాల్ ఉన్న పానీయాలు పరిమితం చేయండి, ఇవి నిర్జలీకరణం కలిగిస్తాయి.

Exercise Regularly- ప్రతిరోజూ వ్యాయామం చేయండి

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఫిట్‌గా ఉండటమే కాకుండా చురుకుగా ఉంటారు. వ్యాయామంతో మీరు శక్తిని పొందగలుగుతారు. పగటి నిద్ర లేదా అలసటను నివారించగలుగుతారు. రోజంతా తాజాగా ఉండేందుకు ఉదయం పూట వ్యాయామం చేయండి. వాతావరణం చల్లబడ్డాక మీరు పరుగు, నడక కోసం వెళ్ళవచ్చు. లేదా వేసవిలో స్విమ్మింగ్ చేయడం కూడా మంచి వ్యాయామం అవుతుంది.

Low Blood Pressure- రక్తపోటును తనిఖీ చేయండి

రక్తపోటు పడిపోవడం కొన్నిసార్లు మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తుంది. వేడికాలంలో రక్తపోటు తగ్గడం, బలహీనత, అలసటకు దారితీస్తుంది, కాబట్టి మీ రక్తపోటును సరైన స్థితిలో నియంత్రణలో ఉంచుకునే చర్యలు తీసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం