Low Blood Pressure | లో బీపీని ఈ ఇంటి చిట్కాలతో తగ్గించుకోండి..
మానవుని రక్తపోటు 120/80 పరిధిలో ఉన్నప్పుడు సాధారణమైనదిగా పరిగణిస్తారు. 90/60 కంటే తక్కువగా లో బీపీగా పరిగణిస్తారు. అధిక రక్తపోటు ఎంత ప్రమాదకరమో... తక్కువ రక్తపోటు కూడా ప్రమాదకరం. దీనిని తగ్గించుకోవడం కోసం ఇంట్లోనే కొన్ని నివారిణులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Low Blood Pressure | జీవనశైలి వ్యాధులు అనేవి ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి. దానిలో రక్తపోటు కూడా ఒకటి. అధిక రక్తపోటుతో పెద్ద ప్రమాదమేమి లేదు కానీ తక్కువ రక్తపోటు (లో బీపీ)తో ప్రమాదాలు తప్పవు అంటున్నారు నిపుణులు. లో బీపీతో అప్పుడప్పుడు కళ్లు తిరిగి పడిపోవచ్చు లేదా కళ్ల ముందు చీకటి ఏర్పడి మూర్ఛవచ్చే అవకాశం కూడా ఉంది.
మెదడుకు తగినంత రక్తం చేరకపోవడం ఇలా జరిగే ప్రమాదమంది. మూర్ఛ, మైకము, కళ్లు ముందు చీకటిగా ఉండటం, అలసట, వాంతులు లేదా వికారం, చేతులు, కాళ్లు చల్లగా మారడం, చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం. వీటిని తగ్గించుకోవాలంటే.. ఈ చిట్కాలను పాటించాలి అని సూచిస్తున్నారు నిపుణులు.
1. కాఫీ..
మీ రక్తపోటు చాలా తక్కువగా ఉంటే.. ప్రతిరోజూ కాఫీ తీసుకోవాలి. కాఫీ-టీలలో ఉండే కెఫిన్ రక్తపోటును పెంచడానికి పని చేస్తుంది. మీకు అసౌకర్యంగా అనిపించినప్పుడల్లా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కళ్లు తిరగడం, టీ లేదా కాఫీ తాగండి.
2. తులసి..
తులసిలోని యూజినాల్ తక్కువ రక్తపోటును సాధారణీకరించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తులసి ఆకులను నమలడం వల్ల కూడా రక్తపోటు సాధారణంగా ఉంటుంది. తులసిలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి తక్కువ రక్తపోటును సాధారణ స్థితికి తీసుకువస్తాయి. మీరు తులసి డికాక్షన్, తులసి టీ కూడా తాగవచ్చు.
3. మజ్జిగ
మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. అంతేకాకుండా ఇది తక్కువ రక్తపోటును నివారిస్తుంది. సాధారణంగా వేసవి కాలంలో తప్పనిసరిగా మజ్జిగ తాగుతూ ఉంటారు. మీ రక్తపోటు తగ్గినప్పుడల్లా మజ్జిగ తాగుతూ ఉండండి. మజ్జిగలో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్‌తో పాటు తక్కువ రక్తపోటు అదుపులో ఉంటుంది.
4. లెమన్ వాటర్
లెమన్ వాటర్ తాగడం వల్ల తక్కువ రక్తపోటు సమస్య కూడా దూరమవుతుంది. శరీరంలో తక్కువ ద్రవం కారణంగా కూడా చాలా సార్లు రక్తపోటు తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో రోజంతా తగినంత ద్రవాన్ని తీసుకోవాలి.
5. అల్లం
అల్లం ముక్కను నమలడం, దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగడం, ఖర్జూరం పాలతో కలిపి తినడం, టమాటా, ఎండుద్రాక్ష, క్యారెట్ మొదలైన వాటిని తీసుకోవడం వల్ల రక్తపోటు సాధారణ స్థాయిలో ఉంటుంది.
రక్తపోటు తరచూ హెచ్చుతగ్గులు అవుతుంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. దానికి కారణమేంటని గుర్తించడం కూడా అంతే కీలకం.
సంబంధిత కథనం