Fatty liver disease: ఈ 5 లైఫ్‌స్టైల్ మార్పులతో ఫ్యాటీ లివర్ డిసీజ్ దూరం చేయండిలా
Nonalcoholic fatty liver disease: నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇప్పుడు యువతలో ఎక్కువ మందిలో కనిపిస్తోంది.
ఫ్యాటీ లివర్ డిసీజ్ లివర్‌లో అధిక కొవ్వు ఉండడం మూలంగా ఏర్పడుతుంది. ఆల్కహాల్ తాగే వారిలో ఇది సర్వసాధారణం. గడిచిన కొన్ని దశాబ్దాలుగా మద్యపానం చేయనివారిలో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్‌ఎల్‌డీ) వస్తోంది. ముఖ్యంగా యువకుల్లో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏర్పడడం ఆందోళన కలిగించే అంశం. దీనికి ప్రధాన కారణం లైఫ్‌స్టైల్ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎపిడెమిలాజికల్ అధ్యయనాల ప్రకారం 9 శాతం నుంచి 32 శాతం సాధారణ జనాభాలో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రభావానికి లోనైంది. అధిక బరువు, ఊబకాయం, డయాబెటిస్, ప్రిడయాబెటిస్ కలిగి ఉన్న వారు ఎక్కువగా ఈ లివర్ ఫ్యాటీ డిసీజ్ బారిన పడ్డారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ 2 రకాలు
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ 2 రకాలు. మొదటి రకం చాలా సాధారణమైనది. లివర్ సెల్స్ నష్టపోవడం గానీ, మంట ఉండడం గానీ ఉండదు. కేవలం లివర్‌లో ఫ్యాట్ ఉంటుంది. అయితే నాన్ ఆల్కహాలిక్ స్టెటొహెపటైటిస్ లేదా నాష్‌గా పిలుచుకునే ఫ్యాటీ లివర్‌లో లివర్ సెల్స్ డామేజ్, ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. ఈ లక్షణాలు ఫైబ్రోసిస్, సిరాసిస్, లివర్ క్యాన్సర్‌లకు దారితీస్తుంది.
అధిక కొలెస్టరాల్, ఒబెసిటి, హైబ్లడ్ షుగర్ లెవెల్స్, హై ట్రైగ్లైజరైడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, స్లీప్ ఆప్నియా వంటి అనేక ఇతర వ్యాధులు కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏర్పడడానికి కారణమవుతాయి.
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా యువతలో పుట్టుకొస్తున్నాయని, జీవనశైలి ప్రభావమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం వారి లైఫ్‌స్టైల్ ఛేంజ్ చేస్తే ఎలాంటి ఖర్చు లేకుండా వారి వ్యాధి నయం చేయవచ్చని చెబుతున్నారు. వైద్యులు సూచిస్తున్న 5 టిప్స్ ఇక్కడ చదవండి.
Stop non-veg, gluten and dairy: నాన్ వెజ్, గ్లుటెన్, డెయిరీ ఫుడ్స్ ఆపండి
నాన్ వెజ్, గ్లుటెన్ ఉన్న ఆహార పదార్థాలు, డెయిరీ సంబంధిత ఉత్పత్తులు జీర్ణం అవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. లివర్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు ఉడికించనివి తినడం కూడా మానేయాలి. అలాగే డీప్ ఫ్రై చేసిన ఆహారం, పులియబెట్టిన ఆహారం (ముఖ్యంగా మినుములు), మైదా, ప్యాకేజ్డ్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోరాదు. సులువుగా జీర్ణమయ్యే చిరుధాన్యాలు, ఉడికించిన కూరగాయలు, వరి అన్నం, వరి ధాన్యం ఆధారిత ఆహారం తినొచ్చు.
Stop alcohol and caffeine: ఆల్కహాల్, కెఫైన్ మానేయండి
ఆల్కహాల్ తీసుకోవడం, కెఫైన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ తీసుకోవడం మానేయండి. ఇవి మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. అందువల్ల వీటిని ఆపేసి లెమన్ గ్రాస్, ధనియా, జీర, హిబిస్కస్, పూదీన, అల్లం వంటి హెర్బల్ టీ ట్రై చేయండి.
Hydration is important: హైడ్రేషన్ అవసరం
మన మెటబాలిజంలో నీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తగినంత నీరు లేకపోతే మీ ఆహారాన్ని అణువులుగా విడగొట్టడం కష్టమవుతుంది. అలాగే ఆహారాన్ని జీర్ణించుకుని వాటి నుంచి తగిన న్యూట్రిషన్లను పొందడానికి నీరు అవసరం. అందువల్ల మీ బాడీ హైడ్రేట్‌గా ఉండేలా చూడండి.
Have meals on fixed times: నిత్యం ఒకే సమయంలో భోజనం
యువతలో ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి తినే ఆహారమే ప్రధానంగా కారణమవుతోంది. ఏ సమయంలో పడితే ఆ సమయంలో తినడం, ఆకలిగా ఉన్నప్పుడు తినకపోవడం, ప్రతి రెండు గంటలకోసారి తినడం వంటి అలవాట్లను మానుకోవాలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రోజులో మీరు ఎక్కువ పరిమాణంలో తీసుకునే భోజనం ఉదయం 10 నుంచి 2 గంటల మధ్యలోనే ఉండాలి. తద్వారా మీ భోజనం నుంచి మీరు అధిక ప్రయోజనం పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే డిన్నర్ ఆలస్యంగా చేయొద్దని, సూర్యాస్తమయంలోపే డిన్నర్ ముగించాలని కూడా చెబుతున్నారు. ఒకవేళ సాధ్యం కానిపక్షంలో రాత్రి 8 లోపు డిన్నర్ ముగించాలని సూచిస్తున్నారు. డిన్నర్‌లో వెజిటేబుల్ సూప్స్, అన్నం, కిచిడీ, శనగ పిండితో చేసిన చిల్లా, లేదా రాగి, జొన్నలతో చేసినవి, చిరు ధన్యాలు, కూరగాయలు తీసుకోవచ్చని చెబుతున్నారు.
Fix your sleep schedule: నిద్రకు ఒకే సమయం
నిద్రకు ఒక క్రమమైన షెడ్యూలు అనుసరించడం తప్పనిసరి. రాత్రి 10 గంటలలోపు నిద్రలోకి జారుకోవడం అత్యుత్తమం. రోజూ ఒకే సమయం అనుసరించడం మేలు చేస్తుంది. అది మీ హర్మోన్లలో సమతుల్యతను పెంచుతుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. మీ బరువును నియంత్రిస్తుంది. మీ ఆకలి దప్పికలు క్రమ పద్ధతిలో ఉంచుతుంది. అది మీ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.