Damaging Liver : పండుగ పేరు చెప్పి తాగేస్తారు.. కానీ లివర్ ఊరుకుంటుందా?-liver disease signs and symptoms of liver damage visible in your feet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Liver Disease Signs And Symptoms Of Liver Damage Visible In Your Feet

Damaging Liver : పండుగ పేరు చెప్పి తాగేస్తారు.. కానీ లివర్ ఊరుకుంటుందా?

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 05, 2022 08:30 PM IST

Damaging Liver : Lets Damage Liver Bro అంటారు కానీ.. లివర్ డ్యామేజ్ అయితే చేయడానికి ఇంకేమి ఉండదు అంటున్నారు డాక్టర్లు. క్షవరం అయితే కానీ వివరం తెలియదు అంటారు కదా. అలానే కాలేయం దెబ్బతింటే కానీ అది ఎంత ప్రమాదమో అర్థం కాదు. కాలేయం దెబ్బతిందని మీకు ఎలా తెలుస్తుందో.. సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లివర్ డ్యామేజ్
లివర్ డ్యామేజ్

Damaging Liver : ఇటీవలి కాలంలో చాలా మంది కాలేయ సమస్యలతో పోరాడుతున్నారు. వివిధ కారణాల వల్ల కాలేయం దెబ్బతినవచ్చు. కానీ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాలేయం అనేది పొత్తికడుపు పైభాగంలో ఉన్న పక్కటెముకల లోపల కనిపించే ఒక అవయవం. కాలేయం పిత్తాన్ని విడుదల చేయడం, శరీరంలోని హానికరమైన వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపడం వంటి పనులను చేస్తుంది.

అయితే కాలేయ సమస్యలను ముందుగానే గుర్తిస్తే చికిత్స చేసే అవకాశముంది. కానీ కొన్నిసార్లు ఆ సమస్యలు కనిపించవు. లేకుంటే ఆ సమస్యలు దానికి చెందినవి అని మనం అనుకోకపోవడం వల్ల.. నష్టం తీవ్రంగా ఉంటుంది. అందుకే మీరు దాని ప్రారంభ లక్షణాలు, సంకేతాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కాలేయ వ్యాధి లక్షణాలను మన పాదాలలో కూడా చూడవచ్చు. అయితే కాలేయ సమస్యలు ఎలా తెలుస్తాయో ఇప్పుడు చూద్దాం.

వాపు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు మీ పాదాలు, చీలమండలు లేదా అరికాళ్లలో వాపును చూస్తే అది సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్ అని గుర్తించాలి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, కొన్నింటితో సహా అనేక రకాల కాలేయ సంబంధిత పరిస్థితులను ఈ లక్షణాలు సూచిస్తాయి. మీరు మీ పాదాలలో వాపును గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

చేతులు, అరికాళ్లలో దురద

కొంతమంది హెపటైటిస్ రోగులు మరింత తీవ్రమైన పరిస్థితులలో ఎదుర్కోవాల్సిన లక్షణం చేతులు, అరికాళ్లలో దురద. ఇది ప్రురిటస్ అనే పరిస్థితి వల్ల వస్తుంది. దీనివల్ల మీ చర్మం చాలా దురదగా మారుతుంది. ప్రురిటస్‌తో పాటు కాలేయ వ్యాధి కూడా మీ చేతులు, కాళ్ల చర్మం చాలా పొడిగా మారుతుంది. ఇది చికాకును మరింత పెంచుతుంది. ఈ పరిస్థితిలో మీరు మీ చేతులు, కాళ్లను హైడ్రేటెడ్​గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

పాదంలో నొప్పి

కాలేయ వ్యాధి వల్ల పాదాలలో అసౌకర్యం పెరుగుతుంది. కాలేయం సరిగా పనిచేయనప్పుడు ఎడెమాలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీర్ఘకాలిక కాలేయ అనారోగ్యం కూడా పరిధీయ నరాలవ్యాధికి సంబంధించినది. ఇది నరాల నష్టం కారణంగా తిమ్మిరి, పక్షవాతం, కాళ్లలో నొప్పిని కలిగిస్తుంది.

కాలేయ వ్యాధికి అత్యంత సాధారణ కారణం హెపటైటిస్. ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, లివర్ సిర్రోసిస్ లాంటివి చాలా రకాల లివర్ డిసీజ్​లు ఉంటాయి.

కాళ్లలో జలదరింపు, తిమ్మిరి

హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ లేదా ఆల్కహాలిక్ కాలేయ వ్యాధి ఉన్నవారిలో కాళ్లలో జలదరింపు లేదా తిమ్మిరిని కలిగిస్తుంది. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఈ రెండు సమస్యలు మధుమేహ రోగులలో తరచుగా ఎదురవుతాయి. వీరికి కాలేయ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మెదడు, వెన్నుపాము వెలుపలి నరాలకు హాని కలిగించే పరిధీయ నరాలవ్యాధే ఈ సమస్యలన్నింటికీ మూలకారణం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్