Emotional Stress : ఒత్తిడితో కడుపు, వెన్ను, కంటి సమస్యలు వస్తాయి.. జాగ్రత్త
Emotional Stress : మీ భావోద్వేగాలు, మీ మానసిక స్థితి మీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయని తెలుసా? మీ ఒత్తిడి, మీ ఆరోగ్యం రెండూ సంబంధం కలిగి ఉంటాయి.
మీ భావోద్వేగాలు, మీ మానసిక స్థితితో మీ ఆరోగ్యం(Health)పై చాలా ప్రభావం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ప్రజలు మానసిక ఒత్తిడికి(mental stress) గురవుతున్నారు. ఒత్తిడి ఏ వ్యక్తిలోనైనా కోపం, ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలను పెంచడమే కాకుండా, అనేక శారీరక సమస్యలను కూడా కలిగిస్తుంది. వీటిలో శరీర నొప్పులు సర్వసాధారణం. ఇది తలలో మాత్రమే కాకుండా చేతులు, కాళ్లలో కూడా ఉంటుంది. భావోద్వేగ ఒత్తిడి(Emotional Stress) కండరాల నొప్పికి ఎలా కారణమవుతుందో చూడండి. మానసిక ఆరోగ్య సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. అయితే ఇవన్నీ మీ శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం మాత్రం ఖాయం.
భావోద్వేగ ఒత్తిడి కారణంగా వెన్నునొప్పి(Back Pain), అధిక అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి, కంటి సమస్యలతో బాధపడవచ్చు. శరీరంలోని వివిధ భాగాలలో ఈ నొప్పి కనిపించడానికి కారణమేమిటో త్వరగా అర్థం చేసుకోలేరు. అయితే సైకియాట్రిస్ట్‌ని సంప్రదించగా అదంతా ఒత్తిడి అని చెబుతారు.
ఒత్తిడితో తల, కనుబొమ్మలలో నొప్పి కనిపించవచ్చు. కార్యాలయం, ఇల్లు, వ్యక్తిగత పనిభారం కారణంగా మీరు కలత చెందవచ్చు. అటువంటి పరిస్థితిలో తలనొప్పి(Headche) పెరగవచ్చు, తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మెదడులోకి సూదిని గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది. తలనొప్పి పెరిగినప్పుడు కనుబొమ్మల దగ్గర ప్రాంతంలో నొప్పి మెుదలవుతుంది.
ఒత్తిడి కారణంగా పనిలో అలసట పెరుగుతుంది. రోజూ శారీరక అలసటతో ఇబ్బంది ఉండదు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే అన్నీ తగ్గుతాయి. కానీ మీరు ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తూ ఒత్తిడి(Stress)కి లోనవుతుంటే, మీకు ఏమీ చేయాలని అనిపించదు. ఎనిమిది నుండి తొమ్మిది గంటలు నిద్రపోయినప్పటికీ అలసట తగ్గదు. చిన్న విషయాలకు కూడా కోపం వస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
పొత్తికడుపు నొప్పి కూడా రావచ్చు. కడుపులో గ్యాస్(Gas) ఉన్నప్పుడే కడుపునొప్పి సమస్య అని.. ఎవరైనా ఇలా అనుకుంటే అది తప్పు. బహిష్టు సమయంలోనూ కడుపునొప్పి రావడం అనేది ఒత్తిడికి లక్షణమే. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కడుపునొప్పి సమస్య సాధారణం, కానీ తరచుగా వస్తే మాత్రం ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపునొప్పి సమస్య మళ్లీ మళ్లీ వచ్చినట్లయితే, మీరు వైద్యుడిని సంప్రదించాలి
వెన్నునొప్పికి(Back Pain), మానసిక ఒత్తిడికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఒత్తిడి విషయంలో దాని ప్రభావం శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. వెన్నునొప్పికి ఒత్తిడితో ప్రత్యక్ష సంబంధం ఉందని అధ్యయనాలు వెల్లడించాయి.
ఒత్తిడి కారణంగా శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో కళ్లలో నొప్పి కనిపించవచ్చు. చూపులో వ్యత్యాసం కూడా కనిపిస్తుంది. కొంతమంది ఈ సమయంలో రంగును గుర్తించడంలో కూడా ఇబ్బంది పడతారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించాలి.